Tiger Tension: కిన్నెరసాని అభయారణ్యంలో అలజడి.. మ్యాన్ ఈటర్ రాకతో జనంలో భయం..!

నిన్న జంగాలపల్లి ఆటవీ ప్రాంతంలో కనిపించిన పెద్ద పులి.. ఇవాళ కిన్నెరసాని అభయారణ్యం లో అడుగుపెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు.

Tiger Tension: కిన్నెరసాని అభయారణ్యంలో అలజడి.. మ్యాన్ ఈటర్ రాకతో జనంలో భయం..!
Tiger
Follow us

|

Updated on: Nov 21, 2021 | 12:21 PM

Tiger Tension in Bhadradri District: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మ్యాన్ ఈటర్ కలకలం.. టేకులపల్లి మండలంలోని జంగాలపల్లి అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున పులి కనిపించింది. రేగళ్ల రేంజర్‌ జశ్వంత్‌ప్రసాద్‌, బీట్‌ ఆఫీసర్‌ శోభన్‌ కారులో వెళ్తుండగా జంగాలపల్లి రహదారి పక్కన నిల్చున్న పులిని చూసి ఫొటోలు తీశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పులి సంచారంపై పరిసర గ్రామాల ప్రజలను అటవీ అధికారులు అప్రమత్తం చేశారు.

జిల్లాలోని కరకగూడెం, పినపాక, లక్ష్మీదేవిపల్లి మండలాల అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తోంది.నిన్న జంగాలపల్లి ఆటవీ ప్రాంతంలో కనిపించిన పెద్ద పులి.. ఇవాళ కిన్నెరసాని అభయారణ్యం లో అడుగుపెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. తోక బంధాల అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. ఈ క్రమంలోనే చాతకొండ రేంజ్ పరిధిలో ఆవుల మందపై దాడి చేసి.., లేగ దూడను చంపివేసినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు పశువులకాపరులు సమాచారమిచ్చారు. అయితే, గత 7 రోజులుగా పినపాక అడవుల్లో సంచరిస్తున్న పులితో సమీప గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మ్యాన్ ఈటర్ రాకతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు తోక బంధాల గ్రామస్తులు. తక్షణమే పులిని బంధించాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also…  Unique Hotel: పైకి చూస్తే భారీ బంగాళదుంప.. లోపల చూస్తే సౌకర్యాల నిలయం..హోటల్ ఫోటోలు వైరల్..