Unique Hotel: పైకి చూస్తే భారీ బంగాళదుంప.. లోపల చూస్తే సౌకర్యాల నిలయం..హోటల్ ఫోటోలు వైరల్..
Potato-Shaped Hotel: సోషల్ మీడియాలో మనం ప్రతిరోజూ ఎన్నో వింతలు విశేషాలకు సంబంధించిన వార్తలు చూస్తూనే ఉన్నాం.. కొన్ని ప్రకృతి కి సంబంధించిన సహజమైన..
Potato-Shaped Hotel: సోషల్ మీడియాలో మనం ప్రతిరోజూ ఎన్నో వింతలు విశేషాలకు సంబంధించిన వార్తలు చూస్తూనే ఉన్నాం.. కొన్ని ప్రకృతి కి సంబంధించిన సహజమైన వింతలకు సంబంధించిన వార్తలు అయితే.. మరికొన్ని మానవ నిర్మితాలైన వింతలకు సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం.. అలాంటి మానవ నిర్మితమైన ఓ ప్రత్యేక హోటల్ గురీంచి ఈరోజు తెలుసుకుందాం.. వివరాల్లోకి వెళ్తే..
అమెరికాలోని ఇడాహో అనే రాష్ట్రంలో ఒక పెద్ద బంగాళా దుంప ఉంది. అది అక్కడి ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తుంది. బంగాళా దుంపేంటి ఆకర్షించడమేంటి అనుకుంటున్నారా.. నిజానికి అది బంగాళా దుంప కాదు.. బంగాళా దుంపను పోలిన ఓ లగ్జరీ హోటల్. ఈ హోటల్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి.
దీని ఇంటీరియర్ మొత్తం అద్బుతంగా తీర్చిదిద్దారు. ఈ హోటల్ అద్దె రోజుకు 18 వేలు పైమాటే. ఈ హోటల్‌లో ఒకేసారి ఇద్దరు వ్యక్తులు లేదా ఫ్యామిలీ బస చేయొచ్చు. ఇక్కడ మీరే స్వయంగా వంట కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ హోటల్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బిగ్ ఇడాహో పొటాటో హోటల్‌లో బస చేసేవారికి స్పెషల్ సౌకర్యాలు ఉన్నాయి. వీటితో పర్యాటకులు ఆనందిస్తారు. కూర్చునే ప్రదేశం, మంచం, అగ్నిమాపక ప్రదేశం, అన్ని ఇతర సౌకర్యాలు ఉంటాయి. అంతేకాదు పెంపుడు జంతువుగా ఉండే ఆవు కూడా ఉంటుందని తెలుస్తోంది.హోటల్‌లోని మెనులో ప్రోటీన్లు, కూరగాయల సహా అనేక ఆహార పదార్ధాలు ఉంటాయి. ఈ హోటల్ లో కాల్చిన బంగాళాదుంపలు స్పెషల్ ఫుడ్ ఐటెం.
అయితే ఇలాంటి ఆకారంలో హోటల్ నిర్మించటం వెనుక ఓ కారణం ఉంది. ఇడాహోలో బంగాళదుంప చిప్స్ చాలా ఫేమస్ అట. అక్కడ ఈ చిప్స్ ఉత్పత్తి భారీగా జరుగుతుందట. అందుకే తమ స్టేట్ బ్రాండ్ ఎంబాసిడర్ అయిన బంగాళాదుంప ఆకారంలో ఈ హోటల్ నిర్మించారట. ఇప్పుడు ఈ హోటల్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది.
Also Read: ఉధృతంగా ప్రవహిస్తున్న తుంగభద్రానది.. నిండుకుండలా తుంగభద్రడ్యాం.. అన్నదాతలు హర్షం..