Pakistani Cop: కొడుకు వైద్యం కోసం సెలవు అడిగితే లంచం అడిగిన అధికారి.. పిల్లలని అమ్మకానికి పెట్టిన ఉద్యోగి.. ఎక్కడంటే
Kids for Sale-Pakistani Cop: పిల్లల్ని పెంచుకోవాలా.. అధికారులకు లంచాలను ఇవ్వాలా అంటూ నిరాశకు గురైన పాకిస్తాన్ పోలీసు తన ఇద్దరు పిల్లల్ని స్వయంగా అమ్మకానికి..
Kids for Sale-Pakistani Cop: పిల్లల్ని పెంచుకోవాలా.. అధికారులకు లంచాలను ఇవ్వాలా అంటూ నిరాశకు గురైన పాకిస్తాన్ పోలీసు తన ఇద్దరు పిల్లల్ని స్వయంగా అమ్మకానికి పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఆ పోలీసు తన ఇద్దరు పిల్లలను 50,000 పాకిస్తానీ రూపాయలకు అమ్ముతున్నానని .. కావాల్సిన వారు కొనుకోవచ్చని అధికారుల తీరు పట్ల తన నిరసనను ప్రదర్శిస్తున్నాడు. పోలీసు యూనిఫామ్ ను ధరించిన ఓ పోలీసులు తన ఇద్దరు చిన్న పిల్లలతో పాటు ఓ రద్దీగా ఉన్న ప్రధాన రహదారి మధ్యలో నిలబడి.. గట్టిగా అరుస్తున్నాడు. తన బిడ్డకు వైద్య చేయించుకోవానికి సెలవుని అడిగితే..తన యజమాని లంచం అడిగాడని.. తన దగ్గర అంత డబ్బులేదని.. వేరే దారిలేక లంచం ఇవ్వడానికి తన పిల్లలని అమ్మకానికి పెట్టానని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
ఇలా తన ఇద్దరు పిల్లలని అమ్మకానికి పెట్టిన వ్యక్తి పేరు నిసార్ లషారీ. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని ఘోట్కీ జిల్లాలో పోలీసుగా పనిచేస్తున్నాడు. జైళ్ల శాఖలో విధులను నిర్వహిస్తున్నాడు. నిసార్ కు ఇద్దరు పిల్లలు. ఒక పిల్లాడికి చికిత్స కోసం తన పై అధికారికి సెలవుపై దరఖాస్తు చేసుకున్నాడు. అయితే నిసార్ పై అధికారి సెలవు మంజూరు చేయాలంటే.. లంచం డిమాండ్ చేశాడు. దీంతో నిసార్ తన ఇద్దరు పిల్లలని ఇలా అమ్మకానికి పెట్టినట్లు చెప్పాడు. అంతేకాదు నేను చాలా పేదవాడిని. తన సీనియర్స్ చేస్తున్న పనిని ఫిర్యాదు చేయడానికి కారాగార ఇన్‌స్పెక్టర్ జనరల్‌కి ఫిర్యాదు చేయడానికి కరాచీకి కూడా వెళ్లలేను. అందుకనే ఇలా చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.
అంతేకాదు నేను నాదగ్గర ఉన్న కొంచెం డబ్బులను లంచంగా చెల్లించాలా.. లేక బిడ్డ ఆపరేషన్ కోసం చెల్లించాలా? నేను లర్కానాలో పని చేయాలా లేక నా బిడ్డను చికిత్స కోసం తీసుకెళ్లాలా?” అతను కొనసాగించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చివరికి సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా కి చేరుకుంది. వెంటనే ముఖ్యమంత్రి మురాద్ అలీ షా జోక్యం చేసుకుని నిసార్ ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు. అంతేకాదు కుమారుడు వైద్యం కోసం 14 రోజులు సెలువు కూడా మంజూరు చేశారు. ఈ వీడియో పై చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి ఇది.. వారి దుస్థితి వెలుగులోకి వచ్చింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
گھوٹکی کے پولیس اہلکار کو بچے کے علاج کے لیے چھٹی نہ ملی اور لاڑکانہ تبادلہ کردیا گیا، چھٹی لینے اور تبادلہ رکوانے کے لیے افسران کو پچاس ھزار روپے رشوت دینی پڑے گی، اہلکار پچاس ھزار میں ایک بیٹا بیچنے کی آوازیں لگاتا رہا۔ ہائے انسانیت کہاں ہے ?? pic.twitter.com/i9hRF7IsNQ
— Sheikh Sarmad (@ShSarmad71) November 13, 2021
Also Read: ముందుగా వైద్యులు నాలుకను ఎందుకు చూస్తారో తెలుసా..ఏ రంగు ఏ సమస్యని సూచిస్తుందంటే..