Lucky Draw Fraud: లక్కీ డ్రా పేరుతో భారీ మోసం.. ఏకంగా రూ. 2 కోట్లతో జంప్..
Lucky Draw Fraud: ప్రజల అమాయకాన్ని, అత్యాశే పెట్టుబడిగా మోసాలకు దిగుతున్నారు కొందరు. రకరకాల ఆఫర్ల పేరుతో ఆన్‌లైన్‌లో సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తుంటే లక్కీ డ్రాల పేరుతో మరికొన్ని..
Lucky Draw Fraud: ప్రజల అమాయకాన్ని, అత్యాశే పెట్టుబడిగా మోసాలకు దిగుతున్నారు కొందరు. రకరకాల ఆఫర్ల పేరుతో ఆన్‌లైన్‌లో సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తుంటే లక్కీ డ్రాల పేరుతో మరికొన్ని మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ లక్కీ డ్రా మోసాలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఎన్ని రకాల మోసాలు వెలుగులోకి వస్తున్నా.. ప్రజలు మోసపోతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఓ మోసమే వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తాజాగా ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొందరు నిర్వాహకులు లక్కీడ్రాను నిర్వహించారు. ఇందులో భాగంగా కొంత మొత్తాన్ని చెల్లిస్తే టీవీలు, ఫ్రిజ్, వాషింగ్ మిషన్లు, బైక్‌లు గెలుచుకోవచ్చని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రజలకు ఆకర్షించే క్రమంలో పాంప్లెట్లు పంచారు. దీంతో చాలా మంది ఆకర్షితులై డబ్బులు చెల్లించారు. ఇలా ఏకంగా రూ. 2 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 500 మంది కస్టమర్లు ఈ లక్కీ డ్రా కోసం డబ్బులు చెల్లించినట్లు సమాచారం. తాము చెల్లించిన డబ్బులను వెంటనే తిరిగి చెల్లించాలని, సదరు లక్కీ డ్రా నిర్వాహకులను అదుపులోకి తీసుకోవాలని బాధితులు కామారెడ్డి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Also Read: వయసు అనేది అసలు సమస్యే కాదు.. డేటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మిక.. వీడియో