Telangana: మంచిర్యాల జిల్లాలో మళ్లీ పులి కలకలం.. ఆందోళనలో స్థానికులు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో పులి సంచరించడం కలకలం రేపింది. కన్నాల పెద్దబుగ్గ ఆలయానికి వెళ్లే రోడ్డు దాటిన పెద్దపులి దట్టమైన అడవిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. సమీపంలోని ఓ కుంట వద్ద పులి నీళ్లు తాగిన ఆనవాళ్లు ఉన్నాయన్నారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Telangana: మంచిర్యాల జిల్లాలో మళ్లీ పులి కలకలం.. ఆందోళనలో స్థానికులు
Tiger Fear
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 02, 2025 | 6:18 PM

అడవుల జిల్లా అదిలాబాద్‌ పరిసర ప్రాంతాలను పులుల సంచారం వణికిస్తోంది. ఇంట్లోనుంచి ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులకు పెద్దపులి కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. మంచిర్యాల జిల్లాలో పులి సంచారం ఆ ప్రాంతవాసులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇటీవల తరచూ పెద్దపులులు, చిరుతలు జనావాసాల్లోకి చొరబడుతూ పశువులను బలితీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మనుషులపై కూడా దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లాలో మరోసారి పులి సంచారం కలకలం రేపింది.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కెమికల్‌ ఏరియా, కాల్‌టెక్స్‌ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్టు గుర్తించారు స్థానికులు. ఈ నేపథ్యంలో ఇళ్లనుంచి జనం బయటకు రావడానికి భయపడుతున్నారు. ఏక్షణంలో ఎవరిపై పులి దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. పులిసంచారంతో బెల్లంపల్లి పట్టణ సమీపంలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విద్యార్ధులను బయటకు పంపించవద్దని పాఠశాల యాజమాన్యాలు తల్లిదండ్రులకు సూచించారు. మరోవైపు పులిసంచారం గురించి అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది పులి పాదముద్రలను గుర్తించారు. పులి సంచరిస్తున్న క్రమంలో ప్రజలు ఒంటరిగా బయట తిరగవద్దని, పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు గుంపులుగా వెళ్లాలని సూచించారు. రాత్రి వేళ ఒంటరిగా బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

జపనీయులు అంత నాజూకుగా ఉండటానికి కారణమేంటో తెలుసా ??
జపనీయులు అంత నాజూకుగా ఉండటానికి కారణమేంటో తెలుసా ??
కారును రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి పోనిచ్చి.. ఆ పై పట్టాల మీద పడి ??
కారును రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి పోనిచ్చి.. ఆ పై పట్టాల మీద పడి ??
షోకాజ్‌ నోటీసులపై తీన్మార్‌ మల్లన్న కీలక వ్యాఖ్యలు!
షోకాజ్‌ నోటీసులపై తీన్మార్‌ మల్లన్న కీలక వ్యాఖ్యలు!
ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. అన్ని ఇందులోనే.. సరికొత్త రైల్వే యాప్
ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. అన్ని ఇందులోనే.. సరికొత్త రైల్వే యాప్
తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ కీలక నిర్ణయం.. ఇకపై ఏటా సినిమా అవార్డులు
తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ కీలక నిర్ణయం.. ఇకపై ఏటా సినిమా అవార్డులు
సంక్రాంతి తర్వాత ఇండస్ట్రీ ఆలోచనలో మార్పు.. టికెట్ రేట్లు తగ్గేనా
సంక్రాంతి తర్వాత ఇండస్ట్రీ ఆలోచనలో మార్పు.. టికెట్ రేట్లు తగ్గేనా
అడవి సమీపాన పోలీసుల తనిఖీలు.. ఓ కారులో కనిపించింది చూడగా..
అడవి సమీపాన పోలీసుల తనిఖీలు.. ఓ కారులో కనిపించింది చూడగా..
అద్భుతమైన సస్పెన్స్, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు..
అద్భుతమైన సస్పెన్స్, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు..
ఫిబ్రవరి 12న మెగా జాబ్‌మేళా.. ఎక్కడంటే?
ఫిబ్రవరి 12న మెగా జాబ్‌మేళా.. ఎక్కడంటే?
ఇంకా తగ్గని పుష్ప రాజ్ మేనియా.. అప్పుడే బన్నీ నెక్స్ట్ మూవీ..
ఇంకా తగ్గని పుష్ప రాజ్ మేనియా.. అప్పుడే బన్నీ నెక్స్ట్ మూవీ..