AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిడుగుపాటు నుంచి కాపాడిన హెల్మెట్..

మెదక్ జిల్లాలో మిరాకిల్ జరిగింది. పిడుగుపాటు నుంచి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది హెల్మెట్. ఆశ్చర్యపోతున్నారా.. నిజం.. వెల్దుర్తి మండలం రామాయపల్లికి చెందిన నర్సింహులు అనే వ్యక్తి బైక్ పై వెళ్తున్న సమయంలో భారీ వర్షం కురిసింది. వెంటనే బైకును నిలిపి పక్కనే ఉన్న ఓ చెట్టు కిందకు వెళ్లాడు. నర్సింహులు నిలుచున్న చోటనే ఓ పిడుగు పడింది. వెంటనే అతను స్పృహ తప్పి పడిపోయాడు. పిడుగుధాటికి నర్సింహులు తలపై పెట్టుకున్న హెల్మెట్ ముక్కలైంది. కానీ.. అతని […]

పిడుగుపాటు నుంచి కాపాడిన హెల్మెట్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 22, 2019 | 12:03 PM

Share

మెదక్ జిల్లాలో మిరాకిల్ జరిగింది. పిడుగుపాటు నుంచి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది హెల్మెట్. ఆశ్చర్యపోతున్నారా.. నిజం.. వెల్దుర్తి మండలం రామాయపల్లికి చెందిన నర్సింహులు అనే వ్యక్తి బైక్ పై వెళ్తున్న సమయంలో భారీ వర్షం కురిసింది. వెంటనే బైకును నిలిపి పక్కనే ఉన్న ఓ చెట్టు కిందకు వెళ్లాడు. నర్సింహులు నిలుచున్న చోటనే ఓ పిడుగు పడింది. వెంటనే అతను స్పృహ తప్పి పడిపోయాడు. పిడుగుధాటికి నర్సింహులు తలపై పెట్టుకున్న హెల్మెట్ ముక్కలైంది. కానీ.. అతని తలకు ఎలాంటి గాయం కాలేదు.