Watch Video: కోతి పిల్ల ప్రాణం కాపడటం కోసం ఆ ముగ్గురు.. చివరికి
అది జాతీయ రహదారి. వేలాది వాహనాలు రయ్యి...రయ్యి మంటూ తిరుగుతూ ఉంటాయి. అప్పుడే కోతుల గుంపు రోడ్డు దాటుతున్నాయి. ఇంతలో ఒక కారు కోతి పిల్లను ఢీ కొట్టడంతో అక్కడే స్పృహ కోల్పోయింది. అంతే కోతులు మూక అంతా రోడ్డు మీద వాహనాలు తిరగకుండా హల్ చల్ చేశాయి. ఇలా ఐదు నిమిషాలు పాటు రహదారి పై కోతులు వీరంగం సృష్టించాయి. ఇంతలో ఒక సాఫ్టు వేర్ ఉద్యోగం చేసే యువకుడు బైకుపై వచ్చి నడి రోడ్డుపై పడిన కోతి పిల్లను కాపాడాలని చూశాడు. వెహికిల్స్ వేగంగా వస్తున్నాయి. కోతులు వాహనదారులును బెదర కొడుతున్నాయి.

అది ఖమ్మం జిల్లాలోని జాతీయ రహదారి. వేలాది వాహనాలు రయ్యి.. రయ్యి మంటూ తిరుగుతూ ఉంటాయి. అప్పుడే కోతుల గుంపు రోడ్డు దాటుతున్నాయి. ఇంతలో ఒక కారు కోతి పిల్లను ఢీ కొట్టడంతో అక్కడే స్పృహ కోల్పోయింది. అంతే కోతులు మూక అంతా రోడ్డు మీద వాహనాలు తిరగకుండా హల్ చల్ చేశాయి. ఇలా ఐదు నిమిషాలు పాటు రహదారి పై కోతులు వీరంగం సృష్టించాయి. ఇంతలో ఒక సాఫ్టు వేర్ ఉద్యోగం చేసే యువకుడు బైకుపై వచ్చి నడి రోడ్డుపై పడిన కోతి పిల్లను కాపాడాలని చూశాడు. వెహికిల్స్ వేగంగా వస్తున్నాయి. కోతులు వాహనదారులును బెదర కొడుతున్నాయి. ఇంతలో అటుగా వెళ్ళే ఒక వికలాంగుడు ట్రై సైకిల్ మీద వచ్చి వాహనాలు రాకుండా రోడ్డుపై పడిన కోతి పిల్లకు తన వెహికిల్ అడ్డు పెట్టి ట్రాఫిక్ మళ్ళించాడు. సాఫ్టు వేర్ యువకుడు తన చేతులతో స్పృహ కోల్పోయిన కోతి పిల్లను రోడ్డు పక్కనే ఉన్న ఒక బండ రాయిపై పడుకో బెట్టాడు.
అదే సమయంలో ఆ ట్రాఫిక్ లో వెళ్తున్న అంబులెన్స్ వచ్చి ఆగింది. అంబులెన్స్ డ్రైవర్ ముత్తేశ్వరావు మెడికల్ కిట్ తీసుకొని కోతి పిల్లను చేతిలోకి తీసుకొని ఫస్ట్ ఎయిడ్ ట్రీట్ మెంట్ చేశాడు. కోతి గుండె స్పందన చెక్ చేసి…కోతిని ఎలాగైనా బ్రతికించాలని CPR ట్రీట్ మెంట్ చేశాడు. తన చేతి వేళ్ళతో కోతి గుండె పై ప్రెస్ చేస్తూ…గుండె స్పందిస్తుందేమో అని చాలా ప్రయత్నం చేశాడు. కొద్ది నిమిషాలు ప్రయత్నం చేసి కోతి చనిపోయిందని గ్రహించి కోతి కళేబరాన్ని అక్కడే అదే రాయి మీద ఉంచి వెళ్ళిపోయాడు. కొద్ది నిముషాల పాటు స్పందించిన కోతి గుండె చివరకు ఆగిపోయింది. అంబులెన్స్ డ్రైవర్ ముత్తేశ్వరావు కు మనిషైనా, జంతువు వైనా, ప్రాణం కాపాడటం తన కర్తవ్యంగా భావించి మూగ జీవ ప్రాణాలు కాపాడేందుకు బాధ్యతగా ఎంతో ప్రయత్నం చేశాడు. అలాగే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే యువకుడు వేమిరెడ్డి కూడా మానవత్వం చాటేందుకు ముందుకు వచ్చాడు.
మనుషులకే కాదు, ప్రతి జీవి ప్రాణం, ప్రాణమే అని గ్రహించి మూగ జీవం పట్ల ప్రేమను చాటి రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి పడి ఉన్న కోతిని చేతులతో తీసుకొని రోడ్డు పక్కన ఉంచాడు. అదేవిధంగా తనకు కాళ్ళు లేని వికలాంగుడు అయినప్పటికీ మూడు చక్రాల బైకు తో వాహనాలకు అడ్డుగా ఉంచి తన వంతు సహాయంగా కోతి ప్రాణాలు కాపాడాలని ప్రయత్నం చేశాడు. నేషనల్ హైవే పై యాక్సిడెంట్ కు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న కోతి ప్రాణాలు కాపాడేందుకు ముగ్గురు యువకులు చేసిన ప్రయత్నం తోటి వాహన దారులకు కళ్ళు తెరిపించాయి. మనుషుల్లో ఇంకా మానవత్వం దాగి ఉందని చెప్పేందుకు ఈ సంఘటనే నిదర్శనం. ఎన్ని ప్రయత్నాలు చేసినా…పాపం ఆ కోతి ప్రాణాలు నిలబడలేదు. యాక్సిడెంట్లో కోతి గుండెకు దెబ్బ తగలడంతో ఎమర్జెన్సీగా మెడికల్ వైద్యం CPR చేసిన ప్రాణాలు దక్కలేదు. చివరికి చేసేదేం లేక కోతి డెడ్ బాడీ ని అక్కడే వదిలి ఎవ్వరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. యాక్సిడెంట్ గురైన తమ కోతి ఏమైనా బ్రతికిందేమో అని కోతులు గుంపు వచ్చి చూసుకొని భాదతో వెనక్కి తిరిగి వెళ్లిపోయాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం