Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: సింగరేణి కార్మికులకు 32 శాతం బోనస్.. సీఎం కేసీఆర్ కీలక ప్రకటన..

Singareni Employees: సింగరేణి సంస్థ లాభాల్లో 32% బోనస్‌గా కార్మికులకు అందించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి‌ నుండి లాభాల్లో కార్మికులకు అందించే వాటాను ప్రతి ఏడాది పెంచుతూ, బొగ్గు గని కార్మికులకు దేశంలోనే అత్యధికంగా దసరా కానుక అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 

CM KCR: సింగరేణి కార్మికులకు 32 శాతం బోనస్.. సీఎం కేసీఆర్ కీలక ప్రకటన..
CM KCR
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 26, 2023 | 6:33 PM

హైదరాబాద్‌, సెప్టెంబర్ 26:2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి సంస్థ లాభాల్లో 32% బోనస్‌గా కార్మికులకు అందించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్. రాష్ట్రం ఆవిర్భావం నుంచి నేటి వరకు సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటను ప్రతి సంవత్సరం పెంచుతూ.. బొగ్గు సింగరేణి కార్మికులకు దేశంలోనే ఎక్కువగా దసరా కానుకలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. సీఎం కేసీఆర్ ప్రకటనతో సింగరేణిలో సంబరలు మొదలయ్యాయి. ముఖ్యమత్రి ప్రకనటపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ లాభాల్లో 32% బోనస్ గా కార్మికులకు అందించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్‌కు కార్మికుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి‌ నుండి లాభాల్లో కార్మికులకు అందించే వాటాను ప్రతి ఏడాది పెంచుతూ, బొగ్గు గని కార్మికులకు సంక్షేమం కోసం పాటు పడుతున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు.

ఇటీవలే సింగరేణి కార్మికులకు 11వ వేజ్‌బోర్డు బకాయిలు రూ.1450 కోట్లను సింగరేణి యాజమాన్యం జమ చేయనుంది. కార్మికులకు వాళ్ల వాళ్ల సర్వీస్‌ సీనియారిటీని బట్టి నగదు జమ అయింది. ఒక్కో కార్మికుడికి ఏరియర్స్‌ రూపంలో దాదాపు రూ.3.70 లక్షల వరకు క్రెడిట్‌ అయ్యింది. ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బు రావడంతో… కార్మికులు సంతోషానికి అవదులు లేవు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు.

ఎన్నికల ప్రకటన కంటే ముందే అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు తెలంగాణ సర్కార్ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రెండు వారాల్లోగా సీఎం స్పెషల్ ఫండ్ నుంచి రూ.5,000 కోట్లు విడుదల చేయనున్నట్లు సీఎంవో అధికారిక వర్గాలు తెలిపాయి. కేంద్ర ఎన్నికల సంఘ అక్టోబర్ 6న అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిధుల కోసం ముఖ్యమంత్రి కార్యాలయం ముందు క్యూ కడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 10,000 కోట్లు కేటాయించడంతో SDF కింద నిధులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం