AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొని ముగ్గురు దుర్మరణం

తెలంగాణ(Telangana) లో వరసగా జరగుతున్న రోడ్డు ప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలో జరిగిన యాక్సిడెంట్ ను మరవకముందే ఖమ్మం(Khammam) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం...

Telangana: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొని ముగ్గురు దుర్మరణం
Ganesh Mudavath
|

Updated on: May 26, 2022 | 8:53 PM

Share

తెలంగాణ(Telangana) లో వరసగా జరగుతున్న రోడ్డు ప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలో జరిగిన యాక్సిడెంట్ ను మరవకముందే ఖమ్మం(Khammam) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారు. ముందు వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటో బోల్తా పడి, ప్రయాణికులు ఎగిరి దూరంగా పడ్డారు. కొందరు ఆటోలోనే చిక్కుకు పోయి తీవ్ర గాయాలపాలయ్యారు. ముదిగొండ మండలంలోని గోకినెపల్లి వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతమంతా రక్తసిక్తమై భయానకంగా మారింది. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే యాక్సిడెంట్ జరిగినట్టు ప్రాధమికంగా తేల్చారు పోలీసులు. ఖమ్మం నుంచి కోదాడ వెళ్తున్న ఆటోలో కెపాసిటీకి మించి ప్యాసింజర్లు ఎక్కినట్టు తెలుస్తోంది.

మరో ఘటనలో సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అలిరాజ్​పేట్ బ్రిడ్జి వద్ద ఎదురెదురుగా వస్తున్న ఆటో, లారీ ఢీకొని నలుగురు మృతి చెందారు. ఆటోలో ఉన్న కనకయ్య, కవితలు ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని నలుగురు క్షతగాత్రులను గజ్వేల్​ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే వారిని గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us