Andhra Pradesh: పవన్, చంద్రబాబుకు మంత్రి బొత్స స్ట్రాంగ్ కౌంటర్.. ఆ విషయంలో వదిలిపెట్టేదే లేదంటూ..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. అధికార, విపక్ష పార్టీల నేతలు సై అంటే సై అంటూ మాటల కత్తులను దూసుకుంటున్నారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. అధికార, విపక్ష పార్టీల నేతలు సై అంటే సై అంటూ మాటల కత్తులను దూసుకుంటున్నారు. కోనసీమ జిల్లా వివాదం నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు పరస్పర దూషణలు చేసుకుంటున్నారు. ఆ ఘటనకు కారణం మీరంటే మీరంటూ కత్తులు దూసుకుంటున్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్‌పై విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేయగా.. ఆ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఆ నాయకులు చేసిన కామెంట్స్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. చంద్రబాబు దివాలాకోరు రాజకీయం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తమ మంత్రి, ఎమ్మెల్యేలపై తామే దాడి చేయిస్తామా? అని ప్రశ్నించారు. చంద్రబాబులా మామ ఇంటిని రాళ్లు వేయించి, అల్లర్లు సృష్టించిన చరిత్ర తమది కాదని అన్నారు. అమలాపురంలో అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర ఉందని, దానిని వెలికి తీసి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు మంత్రి బొత్స. ఇదే సమయంలో పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు మంత్రి బొత్స. పవన్ కల్యాణ్ తాను ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. తుని ఘటనపై చేసిన వ్యాఖ్యలుకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి బొత్స. అంబేద్కర్ పేరు పెట్టాలని కోనసీమలో ప్రతిపక్షాలు కోరలేదా? అని ప్రశ్నించారు మంత్రి. తమ ప్రభుత్వంపై కుట్రలు చేస్తే చూస్తూ ఊరుకోమని, బాధ్యులకు తగిన గుణపాఠం చెప్పి తీరుతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.