RIMS Hospital: కాలం చెల్లిన మందుల ఘటన.. రిమ్స్‌లో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్..
Adilabad RIMS Hospital: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో కాలం చెల్లిన ఇంజక్షన్లు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అలసత్వం
Adilabad RIMS Hospital: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో కాలం చెల్లిన ఇంజక్షన్లు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విధుల్లో అలసత్వం ప్రదర్శించిన ముగ్గురు ఉద్యోగులపై వేటు పడింది. కాలం చెల్లిన ఇంజక్షన్లను రోగులకు ఇచ్చిన హెడ్ నర్స్, ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ విధుల నుంచి తొలగించారు. విదుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి కాలం చెల్లిన మందులు రోగులకు ఇచ్చేందుకు ప్రయత్నించారని.. విచారణలో వెల్లడి కావడంతో వారిపై చర్యలు తీసుకున్నట్లు ఆసుపత్రి అధికారులు వెల్లడించారు.
ఈ మేరకు ఐదుగురు డాక్టర్లతో విచారణ కమిటీ వేసి.. పారదర్శకంగా విచారణ జరిపించి ఆ నివేదికలను జిల్లా కలెక్టర్, డి హెచ్‌లకు రిమ్స్ డైరక్టర్ సమర్పించారు. ఆ సమయంలో విధులు నిర్వహించిన హెడ్ నర్స్, ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు.
ఈ నెల 14న ఆసుపత్రిలోని మూడో వార్డులో ఉన్న పేషెంట్లందరికీ వైద్య సిబ్బంది కాలం చెల్లిన ఇంజక్షన్లను ఇచ్చారని రోగుల బంధువులు ఆందోళనకు దిగారు. వార్డులో 12 మందికి జనవరితో గడువు ముగిసిన ఇంజక్షన్లను ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. రోగి బంధువు గుర్తించి వైద్య సిబ్బందికి చెప్పేంతవరకు విషయాన్ని గుర్తించకపోవడంతో రోగులు తీవ్ర అభ్యంతరాన్ని తెలిపారు. దీంతో ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
Also Read: