India Covid-19: 102 రోజుల తర్వాత.. 40 వేలకు దిగువన నమోదైన కరోనా కేసులు.. నిన్న ఎంతమంది మరణించారంటే..?
India Coronavirus: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. గత కొంతకాలం క్రితం నాలుగు లక్షలకు చేరువలో నమోదైన కేసులు కాస్త..
India Coronavirus: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. గత కొంతకాలం క్రితం నాలుగు లక్షలకు చేరువలో నమోదైన కేసులు కాస్త.. ప్రస్తుతం 50 వేలకు దిగువన నమోదవుతున్నాయి. కాగా.. 102 రోజుల అనంతరం దేశంలో కరోనా కేసులు 40వేలకు దిగువన నమోదైనట్లు కేంద్రం ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం ఉదయం వెల్లడించింది. దీంతో కరోనా రికవరి రేటు 96.87 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. గత 24 గంటల్లో.. సోమవారం దేశవ్యాప్తంగా 37,566 కరోనా కేసులు నమోదయ్యాయి.
దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 907 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం.. 3,03,16,897 కి చేరగా.. మరణాల సంఖ్య 3,97,637కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
కాగా, సోమవారం కరోనా నుంచి 56,994 మంది కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,93,66,601 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 5,52,659 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 17,68,008 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీరితో కలిపి ఇప్పటివరకూ దేశంలో 40,81 కోట్లమందికి పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది.
Also Read: