Telangana – Rythu Bandhu: మూడో రోజు రైతు బంధు నిధుల జమ.. మొత్తం ఎంత విడుదలయ్యాయంటే..
Telangana - Rythu Bandhu: తెలంగాణలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు మూడో రోజు కూడా జమ అయ్యాయి. మూడో రోజు రూ. 1302.6 కోట్లు రైతుబంధు నిధులు జమ చేశారు.
Telangana – Rythu Bandhu: తెలంగాణలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు మూడో రోజు కూడా జమ అయ్యాయి. మూడో రోజు రూ. 1302.6 కోట్లు రైతుబంధు నిధులు జమ చేశారు. ఇవాళ 10,51,384 మంది రైతులకు లబ్ది పొందారు. మొత్తం మూడు రోజులలో 45,95,167 మంది రైతుల ఖాతాలలో 3,102.04 కోట్లు జమ అయ్యాయి. మొత్తం 62,04,085 ఎకరాలకు రైతుబంధు నిధులు పంపిణీ చేశారు. ఈ మేరకు వివరాలను వెల్లడించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. సాగుకు సహకారమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో సాగుకు దూరమైన రైతాంగాన్ని వ్యవసాయంలో నిమగ్నం చేశామన్నారు. దేశంలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయరంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఊపిరి పోశారని అన్నారు.
కేసీఆర్ ముందుచూపుతో వ్యవసాయ అనుకూల విధానాలు అవలంభించి రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటుతో పాటు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడం మూలంగా రైతులు సాగుపై దృష్టి సారించారని అన్నారు. దాని ఫలితంగానే తెలంగాణలో ఊహించని విధంగా వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి వస్తుందన్నారు. సీఎం సీఆర్ వ్యవసాయ అనుకూల పథకాలు చూసి కేంద్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలు సైతం వ్యవసాయ అనుకూల విధానాలు, పథకాల మీద దృష్టి సారిస్తున్నాయన్నారు. మట్టిని నమ్ముకుని ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత అగ్రభాగంలో ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని పేర్కొన్నారు.
Also read:
Diabetes Care: చలికాలంలో షుగర్ అదుపులో ఉండాలంటే.. ఈ పదార్థాలను తీసుకోండి..
Gold Price: వినియోగదారులకు కొత్త ఏడాదిలో బంగారం ధరలు షాకివ్వనున్నాయా..? కారణం ఏమిటి..?