New Year Celebrations: యు ఆర్ అటెన్షన్ ప్లీజ్.. ఫుల్‌గా తాగి రోడ్డెక్కారో.. రూ. 10వేలు జరిమానా లేదా..
రెండేళ్ల పాటు న్యూఇయర్ సెలబ్రేషన్‌కు దూరంగా ఉన్న జనాలిప్పుడు కొత్త జోష్‌లో ఉన్నారు. అయితే ఒమిక్రాన్ పరుగులు పెడుతోందన్న విషయం తెలుసా అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. తెలుగురాష్ట్రాల్లో ఆంక్షలు విధించిన..
రెండేళ్ల పాటు న్యూఇయర్ సెలబ్రేషన్‌కు దూరంగా ఉన్న జనాలిప్పుడు కొత్త జోష్‌లో ఉన్నారు. అయితే ఒమిక్రాన్ పరుగులు పెడుతోందన్న విషయం తెలుసా అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. తెలుగురాష్ట్రాల్లో ఆంక్షలు విధించిన పోలీసులు.. తాగి రోడ్డెక్కితే మాత్రం తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు. బైబై.. 2021, వెల్‌కుమ్ టు 2022. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న స్లోగన్. మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా జనాలు సిద్ధమయ్యారు. జోష్ కోసం ఎదురుచూస్తున్న యువతను.. యు ఆర్ అటెన్షన్ ప్లీజ్ అంటున్నారు తెలంగాణ పోలీసులు. ఆల్కహాల్‌కు తెలంగాణ ప్రభుత్వం అర్ధరాత్రి వరకు అనుమతి ఇచ్చిందని, ఫుల్ గా తాగి రోడ్డెక్కారో.. తాట తీస్తామంటున్నారు. న్యూ ఇయర్ వేళ నకరాలు చేస్తే.. జైలు ఊచలు లెక్కపెట్టిస్తామని హెచ్చరిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఆంక్షలు విధించిన పోలీసులు.. నిబంధనలను గుర్తు చేస్తున్నారు.
మందుబాబులకు తెలంగాణ పోలీసులు షాకిచ్చారు. న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు కఠినతరం చేశారు. మద్యం సేవించి మొదటిసారి పట్టుబడితే 10వేలు జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష పడుతుందని వెల్లడించారు. రెండోసారి పట్టుబడితే రూ.15 వేలు ఫైన్ లేదా రెండేళ్ల జైలుశిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. రేపు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఫ్లై ఓవర్లు మూసివేస్తామన్న పోలీసులు క్యాబ్, ఆటో డ్రైవర్లకు యూనిఫాంతో పాటు వాహన డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలని హెచ్చరించారు.
మద్యం సేవించి పట్టుబడితే 10 వేలు రూపాయలు ఫైన్ కట్టాల్సిందే. లేదంటే 6 నెలల జైలుశిక్ష ఉంటుంది. రెండోసారి పట్టుబడితే 15 వేల రూపాయల జరిమానా లేదంటే రెండేళ్ల పాటు జైలుశిక్ష అనుభవించాలి. ఏకంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తారు. హైదరాబాద్ వంటి నగరాల్లో రేపు రాత్రి 11 నుంచి ఉదయం తెల్లవారే వరకు ఫ్లైఓవర్లపై రాకపోకలు నిలిపివేస్తారు
మరో వైపు నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పబ్‌లకు ప్రత్యేక సూచనలు చేసింది తెలంగాణ హైకోర్టు. తాగి వాహనం నడిపితే పబ్బు నిర్వాహకులే బాధ్యత వహించాలని హెచ్చరించింది. జనవరి నాలుగో తేది ఉదయం వరకు అమలు చేయాలని పోలీసులను ఆదేశించింది. పబ్బుల నుంచి శబ్ద కాలుష్యం 45 డెసిబుల్స్‌కు మించొద్దని చెప్పింది కోర్టు. పబ్బుల వద్ద తాగి వాహనం నడుపొద్దని సూచించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించింది. పబ్బులకు వెళ్లే జంటలతోపాటు మైనర్లను పబ్బులోపలికి అనుమితించొద్దని ఆదేశించింది.
కోవిడ్ నియంత్రణలో భాగంగా ర్యాలీలు, సభలు జనవరి 2 వరకు నిషేధిస్తూ అన్ని జిల్లాలకు ఆంక్షలు పంపామన్న డీజీపీ మహేందర్ రెడ్డి అమలుచేయాల్సిన బాధ్యత జిల్లా అధికారులదే అని స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలో భాగంగా ఆరోగ్య శాఖ ఇచ్చిన సూచనలు అమలుచేస్తామన్నారు
న్యూ ఇయర్ నిషేదాజ్ఞలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటున్నారు రాచకొండ సీపీ మహేష్ భగవత్. ఈవెంట్స్‌లో డీజేలకు అనుమతి లేదంటున్న సీపీ.. ఫార్మ్ హౌస్‌లలో జరిగే పార్టీలపై నిఘా పెట్టామంటున్నారు. నిషేధిత మత్తు పదార్ధాలు వినియోగిస్తే.. ఆర్గనైజర్స్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటున్నారు.
ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఇళ్ల వద్దే న్యూ వేడుకలు జరుపుకోమంటోంది ఏపీ ప్రభుత్వం. అర్ధరాత్రి ఆరుబయట వేడుకలకు అనుమతి లేదంటున్న పోలీసులు.. సెక్షన్ 30, సీఆర్పీసీ 144 అమలులో ఉందంటున్నారు. నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండండి.. వైరన్ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోండని సూచిస్తున్నారు.
బతికి ఉంటే ఇలాంటి న్యూ ఇయర్ వేడుకలు ఎన్నో జరుపుకోవచ్చు. అయితే ఒకసారి కరోనా బారిన పడితే మాత్రం.. మళ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటామన్న నమ్మకం లేదన్న విషయాన్ని ప్రతిఒక్కరు గుర్తుంచుకోవాలంటున్నారు పోలీసులు.
ఇవి కూడా చదవండి: Resume CV and Biodata: ఈ సంగతి మీకు తెలుసా.. రెజ్యూమ్, సీవీ మధ్య తేడా ఏంటో తెలుసుకోండి..
New Year 2022 Vastu Tips: ఈ కొత్త సంవత్సరాన్ని ఇలా ఆహ్వానించండి.. ఇలా చేస్తే లక్ మీ వెంటే..