AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Year – TSRTC: ‘ఆర్టీసీ బస్సు ఉండగా టెన్షన్ ఎందుకు దండగ.. న్యూ ఇయర్ వేళ మందుబాబుల కోసం సజ్జనార్ కీలక ప్రకటన’

Hyderabad TSRTC Buses: తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకలకు అదనంగా బస్ సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో

New Year - TSRTC: 'ఆర్టీసీ బస్సు ఉండగా టెన్షన్ ఎందుకు దండగ.. న్యూ ఇయర్ వేళ మందుబాబుల కోసం సజ్జనార్ కీలక ప్రకటన'
Tsrtc
Shaik Madar Saheb
| Edited By: |

Updated on: Dec 30, 2021 | 10:06 PM

Share

Hyderabad TSRTC Buses: తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకలకు అదనంగా బస్ సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనే వారి కోసం హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా బస్సులు నడపనున్నట్లు సజ్జనార్ తెలిపారు. సిటీ శివారులో ఉన్న ఈవెంట్స్ జరిగే ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. దీని కోసం ఒక్కరికి 100 రూపాయల ఛార్జ్ వసూలు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.

ఆర్టీసీ సూచించిన 15 ప్రాంతాలకు ప్రాంతాలకు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈవెంట్స్ వెళ్లే వారికోసం రాత్రి 7.30 రాత్రి 9.30 వరకు, తిరుగు ప్రయాణం అర్ధరాత్రి 12.30 నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటన చేసింది. దీంతోపాటు 18 సీట్ల ఏసి బస్సు వెళ్లి రావటానికి 4000 రూపాయలుగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించింది.

కాగా.. అంతకుముందు ఓ నెటిజన్ ట్విట్టర్లో సజ్జనార్ ఓ సూచన చేశారు. ‘‘సార్.. రేపు రాత్రి 1 తర్వాత బస్సులు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ నుంచి నగరం నలుమూలలకు బస్సులు తిప్పాలని కోరాడు. దీంతోపాటు ఇష్టమొచ్చినట్టు రేట్లు పెట్టుకోవాలని.. ఎవ్వరూ కంప్లైన్ చేయడంటూ పేర్కొన్నాడు. ప్రజలంతా మెచ్చుకుంటారంటూ ట్విట్ చేశాడు. అయితే.. దానికి సజ్జనార్ సమాధానమిస్తూ… రూట్లను ఫైనల్ చేస్తున్నామని రీట్విట్ చేశారు. కాగా.. ఆర్టీసీ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Telangana – Rythu Bandhu: మూడో రోజు రైతు బంధులు నిధుల జమ.. మొత్తం ఎంత విడుదలయ్యాయంటే..

TSRTC New Year Gift: ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌.. న్యూ ఇయర్‌ సందర్భంగా చిన్నారులకు ఉచిత ప్రయాణం..

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు