Hyderabad: ఛీఛీ మరీ ఇంత చీప్‌గా ఉన్నారేంట్రా.. సచివాలయంలో బాత్రూమ్‌ను కూడా వదలట్లేదుగా..!
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సెక్రెటేరియట్ హైదరబాద్‌కే ఐకాన్‌గా నిలిచింది. విజిటర్స్‌తో ఆ ప్రాంతం మొత్తం రోజు సాయంత్రం సందడిగా మారుతుంది. ఇరవై నాలుగ్గంటలు హై సెక్యూరిటి ఉండే సచివాలయంలో చిల్లర దొంగలు పడుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సెక్రెటేరియట్ హైదరబాద్‌కే ఐకాన్‌గా నిలిచింది. విజిటర్స్‌తో ఆ ప్రాంతం మొత్తం రోజు సాయంత్రం సందడిగా మారుతుంది. ఇరవై నాలుగ్గంటలు హై సెక్యూరిటి ఉండే సచివాలయంలో చిల్లర దొంగలు పడుతున్నారు. ఎంత చిల్లరగా అంటే బాత్రూంలు దోచుకునేంత చీప్‌గా..
అవును, సచివాలయానికి అనుకుని అనెక్స్ బిల్డిండ్ ఉంది. ఇందులోనే మీడియా పాయింట్, విజిటర్స్ కౌంటర్, బ్యాంకులు, ఎన్‌అర్‌ఐ సెంటర్, క్యాంటిన్ ఉంటాయి. ఇందులోనే విజిటర్స్‌కి టాయిలెట్స్ కూడా నిర్మించారు. ఇన్ని రూముల్లో ఉన్న కుర్చీలు, టేబుల్లు, ఫ్యాన్లు, లైట్లు వదిలేస్తున్న దొంగలు టాయిలెట్స్‌లో ఉన్న ట్యాప్‌లను మాత్రమే దొంగలిస్తున్నారు. సచివాలయం ప్రారంభం నాటి నుంచి ప్రతివారం కొత్త నల్లాను ఫిక్స్ చేస్తుండడం మళ్లీ వాటిని చిల్లర దొంగలు తస్కరిస్తుండడం కామన్‌గా మారిపోయింది. ఇందులో ట్విస్ట్ ఎంటంటే వందల సిసి కెమరాలు ఉన్నా.. ఈ నల్లాల దొంగలు మాత్రం ఎక్కడా కెమరాలకు చిక్కడం లేదు.
అసలు దీన్ని సీరియస్‌గా తీసుకోవాలా.. ఇంత దిక్కుమాలిన స్థితిలో ఉన్న దొంగలెవరా.. అని జాలిపడాలా అనేది అర్ధంకాని పరిస్థితి. ఈ దొంగలు కూడా చాలా పద్దతిగా, కేవలం మగవాళ్ల టాయిలెట్స్‌లోని ట్యాపులనే దొంగతనం చేస్తున్నారు. వుమెన్ టాయిలెట్స్ జోలికి వెళ్లకపోవడం ఈ చిల్లరదొంగలుకున్న సంస్కారం మరి. ఇక స్టీల్ ట్యాపులు పెడితే దొంగలు ఎత్తుకుపోతున్నారని ఈ మధ్య ప్లాస్టిక్ నల్లాలను అమర్చారు సచివాలయ సిబ్బంది. చివరకు మరింత దిగజారి.. వీటిని కూడా దొంగలిస్తుండంతో ఎం చేయాలా అని తలలు పట్టుకుంటున్నారు సెక్యూరిటి సిబ్బంది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
