ఓకే స్టైల్‎లో రెండు దొంగతనాలు.. ఏటీఎంలే వీరి టార్గెట్..

పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతం గోదావరిఖనిలో రెండు ఏటీఎంలలో చోరీ జరిగింది. ఈ ఘటనలకు పాల్పడిన అగంతకులు ఏటీఎం మిషన్లను కట్ చేసి వాటిలో ఉన్న నగదును ఎత్తుకెళ్లి పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు.

ఓకే స్టైల్‎లో రెండు దొంగతనాలు.. ఏటీఎంలే వీరి టార్గెట్..
Atm Thefts
Follow us

| Edited By: Srikar T

Updated on: Feb 11, 2024 | 10:17 AM

పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతం గోదావరిఖనిలో రెండు ఏటీఎంలలో చోరీ జరిగింది. ఈ ఘటనలకు పాల్పడిన అగంతకులు ఏటీఎం మిషన్లను కట్ చేసి వాటిలో ఉన్న నగదును ఎత్తుకెళ్లి పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. గతంలో కూడా గోదావరిఖని, మంథని రహదారిలోని గుంజపడుగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‎లో చోరీ చేశారు దుండగులు. మహారాష్ట్రలోని చంద్రపూర్ కేంద్రంగా వీరు దోపిడీకి అనుకూలంగా ఉన్న బ్యాంకులను, ఏటీఎంలను గుర్తించి చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు. ఏటీఎం చోరీలకు పాల్పడే వారు ప్రత్యేక గ్యాంగ్‎గా ఏర్పడి ఈ ప్రాంతాల్లో సంచరించి చోరీకి పాల్పడుతున్నారు. ఒకప్పుడు బ్యాంకు వెనుక ప్రాంతంలోని చెట్లను నరికి నిచ్చనలా తయారు చేసుకుని బ్యాంకులోకి చొరబడ్డారు. ఆ తరువాత స్ట్రాంగ్ రూంకు సరఫరా అయ్యే విద్యుత్ వైర్లను, సీసీ కెమరా రికార్డింగ్‎ను నిలిపివేశారు.

గ్యాస్ కట్టర్ ద్వారా స్ట్రాంగ్ రూంను పగలగొట్టి అందులోని నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. అయితే అగంతకులు అక్కడి నుండి వెళ్లిపోయేటప్పుడు బ్యాట్రీ అనుకుని డీవీఆర్ బాక్స్ ను తుమ్మ చెట్లలో పడేసి వెళ్లారు. అంతేకాకుండా పోలీసులు కూడా ఈ ఘటనకు ముందు ఈ ప్రాంతంలో తిరిగిన వాహనాలను గుర్తించేందుకు సీసీ ఫుటేజీని ఆధారం చేసుకుని దర్యాప్తు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితల ఆచూకీ కోసం జల్లెడ పట్టారు రామగుండం పోలీసులు. చంద్రపూర్‎, ఉత్తరప్రదేశ్‎కు చెందిన కొందరిని అరెస్ట్ చేశారు. చాలా కాలం తరువాత తిరిగి గ్యాస్ కట్టర్లను ఉపయోగించి దోపిడీకి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో మళ్లీ గ్యాస్ కట్టర్లను ఉపయోగించి చోరీలకు పాల్పేడే గ్యాంగ్ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోకి వచ్చిందన్న అనుమానలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే గుంజపడుగ గ్యాంగ్‎కు తాజాగా చోరీలకు పాల్పడిన గ్యాంగ్‎కు సంబంధం ఉన్నా లేకున్నా, అప్పుడు వారు అలాగే గ్యాస్ కట్టర్లను ఉపయోగించి స్ట్రాంగ్ రూం డోర్లను కట్ చేశారు. అలాగే చంద్రపూర్ ప్రాంతంలోని ఏటీఎంలలో దోపీడికి పాల్పడ్డారు. అప్పటి ఘటనలు, ఇప్పటి ఘటనలు ఒకేరకంగా ఉండటంతో కాస్తా ఆలోచనకు గురిచేస్తోంది. ఈ సారి దొంగతనాలకు పాల్పడిన అగంతకులు సీసీ కెమెరాల్లో తమ ఉనికి రికార్డు కాకూడదని స్ప్రే చేసి మరీ చోరీకి పాల్పడ్డారు. దొంగతనాలకు పాల్పడిన విధానాన్ని బట్టి చూస్తే పర్ ఫెక్ట్ స్కెచ్ తోనే చేసినట్టుగా స్పష్టం అవుతోంది. ఈ రెండు ఏటీఎంలలో సుమారుగా 27 లక్షల నగదును ఎత్తికెళ్లారని పోలీసులు చెబుతున్నారు. దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దిగాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..