Humanity: హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలిన మహిళ.. సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన ఎస్ఐ మహేందర్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి నడి రోడ్డుపై కుప్పకూలి పోయారు. విధుల్లో భాగంగా అటు వైపు వెళ్తున్న ఎస్‌ఐ క్షణం కూడా ఆలస్యం చేయకుండా సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడారు. హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి తక్షణం సాయపడేలా పోలీసులకు ఉన్నతాధికారులు ఇప్పించిన సీపీఆర్ శిక్షణ ఓ నిండు ప్రాణం నిలబెట్టింది.

Humanity: హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలిన మహిళ.. సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన ఎస్ఐ మహేందర్
Cpr By Si Mahendar
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Feb 10, 2024 | 7:37 PM

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి నడి రోడ్డుపై కుప్పకూలి పోయారు. విధుల్లో భాగంగా అటు వైపు వెళ్తున్న ఎస్‌ఐ క్షణం కూడా ఆలస్యం చేయకుండా సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడారు. హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి తక్షణం సాయపడేలా పోలీసులకు ఉన్నతాధికారులు ఇప్పించిన సీపీఆర్ శిక్షణ ఓ నిండు ప్రాణం నిలబెట్టింది. ఈ క్రమంలోనే ఇప్పటికే పోలీసులు సీపీఆర్‌ చేసి అనేకమందికి పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. ఇందుకు ఉదాహరణే తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో జరిగిన ఈ సంఘటన.

వలిగొండ పట్టణంలో ఓ మహిళ రోడ్డుపై కుప్పకూలి పడిపోయింది. ఎక్కడ ఏం జరిగిందో చుట్టుపక్కల ఉన్న జనం గమనించేలోపే, అక్కడే విధుల్లో ఉన్న వలిగొండ ఎస్ఐ మహేందర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించారు. ఆమెకు గుండెపోటు వచ్చినట్టు గుర్తించి వెంటనే సీపీఆర్‌ చేశారు. అనంతరం సమీపంలోని ఆస్పత్రికి తన సొంత వాహనంలో తర‌లించారు. దాంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు వైద్యులు. సీపీఆర్‌ ద్వారా మహిళ ప్రాణాలు కాపాడిన ఎస్ఐ మహేందర్‌ను స్థానికులతో పాటు పోలీస్‌ ఉన్నతాధికారులు అభినందించారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…