Challo Nalgonda: బీఆర్ఎస్ ఛలో నల్లగొండ సభకు అనుమతి.. పోలీసుల షరతులు ఏమున్నాయంటే..!
కృష్ణా జలాల అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. కృష్ణా జలాల పరిరక్షణ ధ్యేయంగా ఈ నెల 13న నల్లగొండలో బీఆర్‌ఎస్ నిర్వహించనున్న సభపై సస్పెన్స్ వీడింది. ఉత్కంఠగా మారిన ఈ సభకు షరతులతో కూడిన అనుమతి పోలీసులు ఇచ్చారు. దీంతో నల్లగొండలో జరిగే భారీ బహిరంగ సభకు ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా మాజీ సీఎం కేసీఆర్ ఈ సభలో పాల్గొననున్నారు.

వారం రోజులుగా కృష్ణా జలాల అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కృష్ణ రివర్ బోర్డుకు మీరే అప్పగించారంటూ పరస్పరం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శల దాడి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల పరిరక్షణ ధ్యేయంగా బీఆర్ఎస్ ఫిబ్రవరి 13వ తేదీన ఛలో నల్లగొండ భారీ బహిరంగ సభకు పిలుపు నిచ్చింది. ఈ సభకు పోలీసులు అనుమతిస్తారా లేదా అనే ఉత్కంఠ కొనసాగింది.
ఫిబ్రవరి 7వ తేదీన నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రవీంద్ర కుమార్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి బహిరంగ సభకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తును పరిశీలించిన జిల్లా ఎస్పీ చందనా దీప్తి, నల్గొండ డీఎస్పీ విచారణ చేసి సభకు షరతులతో అనుమతి ఇచ్చారు. జిల్లాలో పోలీస్ 30 యాక్టు అమలులో ఉన్నందున బహిరంగ సభకు పది రకాల షరతులతో కూడిన అనుమతిని పోలీసులు ఇచ్చారు. సభను మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని, పట్టణంలో ఎలాంటి బాణసంచా కాల్చడానికి అనుమతి లేదని, సభా సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకూడదనే షరతులు విధించింది.
అంతేకాదు సభలో ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేయకూడదని, ఇతర పార్టీలను కించపరిచేలా ప్రసంగాలు చేయకూడదనే ప్రధాన షరతులను అనుమతిలో పోలీసులు పేర్కొన్నారు. బహిరంగ సభకు పోలీసుల అనుమతి ఉన్నవారు మాత్రమే హాజరు కావాలని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు పాటించక పోతే అనుమతి రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…