Wealth Astrology: ఆ రాశుల వారు భారీగా డబ్బు కూడబెట్టే ఛాన్స్..! ఇందులో మీ రాశి ఉందా..?
జ్యోతిషశాస్త్రం ప్రకారం మిథునం, కన్య, వృశ్చికం, కుంభం, మీన రాశులు మార్మిక స్వభావం కలిగిన రాశులుగా భావించబడతాయి. ఈ రాశులకు చెందిన వారు ఏమి ఆలోచిస్తున్నారో, ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నారో, ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో ఇతరులకు అర్థం చేసుకోవడం లేదా ఊహించడం చాలా కష్టం. వీరు సాధారణంగా ఇతరుల సలహాలు, సూచనలను పెద్దగా పట్టించుకోరు. ఈ ఏడాది మొత్తం వీరికి అనుకూలంగా ఉండబోతోంది. వీరు చేసిన ఆలోచనలు, ప్రయత్నాలు ఎక్కువగా ఫలించే అవకాశాలు ఉన్నాయి.

Wealth Astrology
జ్యోతిషశాస్త్రం ప్రకారం మిథునం, కన్య, వృశ్చికం, కుంభం, మీన రాశులు మార్మిక రాశులు (మిస్టరీ సైన్స్). ఈ రాశులవారు ఏం ఆలోచిస్తున్నారో, ఏం ప్లాన్ చేస్తున్నారో, ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పడం, గ్రహించడం, ఊహించడం చాలా కష్టం. ఇతరుల సలహాలు, సూచనలతో వీరికి నిమిత్తం లేదు. ఈ రాశుల వారికి ఈ ఏడాదంతా బాగుండబోతోంది. వీరి ఆలోచనలు చాలావరకు ఫలిస్తాయి. వీరు మూడో కంటికి తెలియకుండా తాము అనుకున్నది సాధిస్తారు. వీరు పొదుపరులు. బాగా డబ్బు దాచే లేదా కూడబెట్టే అవకాశం ఎక్కువగా ఉంది.
- మిథునం: జూన్ వరకు ఈ రాశిలోనూ, జూన్ తర్వాత నుంచి ఏడాదంతా ధన స్థానంలోనూ గురువు సంచారం వల్ల ఈ రాశివారు తమ ప్రజ్ఞాపాటవాలను, నైపుణ్యాలను బాగా మెరుగుపరచుకునే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టి సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. ఈ రాశికి అధిపతి అయిన బుధుడు తెలివితేటలు, నైపుణ్యాలకు కారకుడైనందువల్ల వీరు ఏ రంగంలో ఉన్నా అంచెలంచెలుగా ఎదిగిపోతాయి. అన్ని విధాలు శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది.
- కన్య: ఈ రాశికి కూడా బుధుడే అయినందువల్ల ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఉద్యోగపరంగానూ, ఆ తర్వాత ఆరు నెలలు ధనపరంగానూ ఈ రాశివారు దూసుకుపోతారు. ఉద్యోగంలో పైకి ఎదగడా నికి అవసరమైన ప్రతిభా పాటవాలను, నైపుణ్యాలను, సమర్థతను బాగా ఒంటబట్టించుకుంటారు. ఉద్యోగంలోనే కాదు, వృత్తి, వ్యాపారాల్లో కూడా పోటీదార్ల మీద ఊహించని విజయాలు సాధిస్తారు. ఆదాయాన్ని పెంచుకోవడంతో బాటు, ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని పూర్తిగా పరిష్కరించుకుంటారు.
- వృశ్చికం: ఈ రాశివారు దీర్ఘకాలిక ప్రణాళిలను రూపొందించడంలో దిట్టలు. ఈ రాశికి అధిపతి అయిన కుజుడు ప్రతిదాన్నీ పట్టుదలగా సాధించుకుంటారు. వీరికి ఇతరుల సలహాలు అవసరం లేదు. మూడో కంటికి తెలియకుండా వీరు అటు కెరీర్ లోనూ, ఇటు ఆదాయంలోనూ బంధు మిత్రులందరి కంటే ఉన్నత స్థాయికి ఎదిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జూన్ మొదటి వారం నుంచి వీరి పురోగతికి పట్టపగ్గాలు ఉండవు. వీరి భవిష్య ప్రణాళికలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి.
- కుంభం: ఈ రాశివారి మనసులో ఏమున్నదో కనుక్కోవడం దేవుడి తరం కూడా కాదు. రాశ్యధిపతి శని ధన స్థానంలో ఉన్నందువల్ల ఈ ఏడాది ఈ రాశివారి ధ్యాసంతా సంపాదన మీదే ఉంటుంది. కుటుంబ పరిస్థితిని చక్కదిద్దడం మీద కూడా ఉంటుంది. ఎంత శ్రమకైనా ఓర్చి డబ్బు కూడబెట్టడాన్ని లక్ష్యంగా పెట్టుకుంటారు. గురువు పంచమ స్థితి వల్ల షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా కూడా బాగా ఆర్జించే అవకాశం ఉంది. నాలుగైదు నెలల్లో తమ లక్ష్యాలను పూర్తి చేసినా ఆశ్చర్యపోనక్కర లేదు.
- మీనం: సాధారణంగా ఈ రాశివారు ఏ విషయంలోనూ బయటపడరు. తమ సాధక బాధకాలను ఎవరితోనూ పంచుకోరు. అయితే, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించడంలో వీరు ముందుంటారు. రాశ్యధిపతి గురువు చతుర్థ స్థానంలో ఉన్నందువల్ల ప్రస్తుతం వీరి లక్ష్యం సొంత ఇల్లు, సొంత వాహనం అమర్చుకోవడం. జూన్ మొదటి వారం నుంచి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛ పడుతున్నందువల్ల వీరి ఆదాయం బాగా పెరిగి, వీరి కోరికలు తీరే అవకాశం తప్పకుండా ఉంది.