ఆ తల్లికి ఎంత కష్టమొచ్చింది..! అందరు ఉండి అనాథగా మిగిలిన అమ్మ!
అడ్డాల నాడు బిడ్డలు కానీ. గడ్డాల నాడు బిడ్డలు కాదని అంటారు. అదే నిజం అనిపిస్తుంది. నవమాసాలు మోసి.. కనిపెంచిన తల్లిని నిర్ధాక్షిణ్యంగా వదిలివెళ్లారు కసాయి కొడుకులు. వృద్ధురాలైన కన్నతల్లిని, కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి.. అనాథగా వదిలేశారు కన్న కొడుకులు.
అడ్డాల నాడు బిడ్డలు కానీ. గడ్డాల నాడు బిడ్డలు కాదని అంటారు. అదే నిజం అనిపిస్తుంది. నవమాసాలు మోసి.. కనిపెంచిన తల్లిని నిర్ధాక్షిణ్యంగా వదిలివెళ్లారు కసాయి కొడుకులు. వృద్ధురాలైన కన్నతల్లిని, కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి.. అనాథగా వదిలేశారు కన్న కొడుకులు. ఉన్న ఆస్తి లాక్కొని, కన్నతల్లికి అన్నం పెట్టకుండా రోడ్డుపై వదిలేసిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.
మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన కుంట సత్తవ్వ వయసు 70 సంవత్సరాలు. ఆమెకి ముగ్గురు సంతానం ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె . ఆమె భర్త కుంట ఎల్లయ్య అనారోగ్యంతో మరణించగా అమె చిన్న కుమారుడు కుంట కృష్ణ గుండెపోటుతో మరణించాడు. అయితే ఆమె పేరు మీద ఉన్న భూములను ఇద్దరు కొడుకులు సమంగా పంచుకున్నారు. ఉన్న భూమిని అమ్ముకుని, తల్లి దగ్గర ఉన్న బంగారాన్ని లాక్కొని ఇంటిలో నుంచి గెంటి వేశారని సత్తవ్వ బోరున విలపించింది. చిన్నప్పటినుండి కంటికి రెప్పలా కాపాడిన తల్లి వారిని కనిపెంచి పెద్దవారిని చేసింది. ఇదేనా నేను చేసిన పాపం అంటూ తల్లి సత్తవ్వ ఆవేదన గురైంది.
పెద్ద కుమారుడు రమేష్ మెదక్ లో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. మద్యానికి బానిసైన కొడుకు రమేశ్ రోజు తాగి వచ్చి పింఛన్ డబ్బులు ఇవ్వాలని గొడవ దిగుతున్నాడు. ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించేవాడని ఆమె తెలిపారు. చివరికి ఆమెకు ఒక పూట భోజనం పెట్టకుండా ఇంటిలో నుంచి గెంటి వేయడంతో ఆమె రోడ్డుమీద బతికే పరిస్థితి ఏర్పడింది. చివరికి వేధింపులు భరించలేక ఆమె ఇంట్లో నుండి వెళ్లిపోయి, అనాథగా రోడ్డుపై కాలం వెళ్లదీస్తోంది సత్తవ్వ. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటుంది.
వీడియో చూడండి…
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..