AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devadula Project: తెలంగాణ ముఖచిత్రం మార్చడమే లక్ష్యం.. రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం!

సీతారామ ఎత్తిపోతల పంప్‌లు స్విచ్‌ఆన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. దేవాదుల లిఫ్ట్‌ పంపులను కూడా త్వరలోనే ఆన్‌ చేయబోతోంది. 20 ఏళ్లుగా ఆగుతూ, నడుస్తూ వస్తున్న ప్రాజెక్ట్‌ను.. ఇకపై పరుగులు పెట్టించి ఏడు జిల్లాలకు నీళ్లందించాలనే లక్ష్యం పెట్టుకుంది.

Devadula Project: తెలంగాణ ముఖచిత్రం మార్చడమే లక్ష్యం.. రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం!
Ministers Devadula Project Visit
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Aug 30, 2024 | 7:00 PM

Share

సీతారామ ఎత్తిపోతల పంప్‌లు స్విచ్‌ఆన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. దేవాదుల లిఫ్ట్‌ పంపులను కూడా త్వరలోనే ఆన్‌ చేయబోతోంది. 20 ఏళ్లుగా ఆగుతూ, నడుస్తూ వస్తున్న ప్రాజెక్ట్‌ను.. ఇకపై పరుగులు పెట్టించి ఏడు జిల్లాలకు నీళ్లందించాలనే లక్ష్యం పెట్టుకుంది. స్వయంగా దేవాదుల ప్రాజెక్ట్‌ను పరిశీలించిన మంత్రులు.. డెడ్‌లైన్‌ కూడా ఫిక్స్ చేశారు.

2026 మార్చి నెలాఖరు లోపు దేవాదుల పెండింగ్ పనులు వంద శాతం పూర్తిచేసి సోనియాగాంధీ చేత ఈ ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం మూడో దశ పెండింగ్ పనుల పరిశీలన కోసం సహచర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కతో కలిసి దేవాదుల ప్రాజెక్టు ఇంటెక్వెల్ పరిశీలించారు. నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ముగ్గురు మంత్రులు గత ప్రభుత్వం నీటి పారుదల శాఖను అడ్డం పెట్టుకొని డెకాయిట్స్ లా వ్యవహరించారని ఆరోపించారు.

కాలేశ్వరం ప్రాజెక్టును రాజకీయ వివాదాలు చుట్టుముట్టి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పై దృష్టి పెట్టింది. మూడో దశ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేసి ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా కసరత్తు మొదలు పెట్టింది. అందులో భాగంగానే నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు సీతక్క, పొంగులేటి నీటిపారు దలశాఖ నిపుణులు, అధికారుల బృందం దేవాదుల ఇంటెక్వెల్ను పరిశీలించి అక్కడే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

తక్షణమే పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లు ఆదేశించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, 2025 చివరి నాటికీ పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. 2026 మార్చి నెలాఖరులోపు సోనియాగాంధీ చేత ఈ ప్రాజెక్టును ప్రారంభించి ఉత్తర తెలంగాణ జిల్లాలకు అంకితం చేస్తామని ప్రకటించారు. గత పాలకులు ఇరిగేషన్ శాఖను అడ్డుపెట్టుకొని డెకాయిట్స్‌లా వ్యవహారించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రతి ప్రాజెక్టులో వేలకోట్ల అవినీతి జరిగిందని మంత్రి ఆరోపించారు. ప్రతి ప్రాజెక్టులో వేల కోట్ల స్కాం జరిగిందని, ప్రాజెక్ట్‌ల పేరుతో లక్ష 81 వేల కోట్ల నిధులు కేసీఆర్ హయంలో ఖర్చు పెట్టారని అన్నారు. కమిషన్ల కక్కుర్తితో ప్రాజెక్టులు కట్టారని, కాళేశ్వరం, పాలమూరు, దేవాదుల, సీతారామ అన్నిట్లో దోచుకున్నారని ఆరోపించారు. తెలంగాణ గ్రామీణ ముఖ చిత్రం మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రులు. నిర్దేశిత గడువు లోపు దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తిచేసి, 5.57 లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తామన్నారు.

సమ్మక్క బ్యారేజ్ కట్టడం వల్ల దేవాదుల ద్వారా 300 రోజులు, 60 టీఎంసీల నీళ్ళు లిఫ్ట్ చేస్తామని.. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేసీఆర్ కు అవగాహన లేకుండా తీరని అన్యాయం చేశారని, ఫార్మ్ హౌజ్ లో కూర్చొని నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు మంత్రులు.

వీడియో చూడండి…

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..