సెల్ఫీ దిగుతుండగా కాలుజారి కాలువలో.. శ్రమించి కాపాడిన స్థానికులు..!

యువతకు సోషల్ మీడియా పిచ్చి బాగా ముదురుతోంది. ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఎక్కడబడితే అక్కడ వీడియోలు చేస్తూ చావు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ సరదా సెల్ఫీ కోసం ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. రెప్పపాటులో ప్రాణాలతో బయటపడంది.

సెల్ఫీ దిగుతుండగా కాలుజారి కాలువలో.. శ్రమించి కాపాడిన స్థానికులు..!
Woman Selfie
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Aug 30, 2024 | 6:40 PM

యువతకు సోషల్ మీడియా పిచ్చి బాగా ముదురుతోంది. ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఎక్కడబడితే అక్కడ వీడియోలు చేస్తూ చావు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ సరదా సెల్ఫీ కోసం ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. రెప్పపాటులో ప్రాణాలతో బయటపడంది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో వెలుగు చూసింది.

ఓ మహిళ సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడింది. వెంటనే స్పందించిన స్థానికులు, ఆ మహిళను శ్రమించి ప్రాణాలతో కాపాడారు. ఈ ఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలం కేంద్రంలోని ఎడమ కాలువ వద్ద చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న ఓ ఫ్యామిలీ సరదగా చుద్దామని.. నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్దకు వెళ్లారు. అయితే అక్కడ తన భర్త, తమ్ముడు, కూతురుతో కలిసి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. ఇంతలో ప్రమాదవశాత్తు మహిళ కాలు జారి కాలువలో పడింది. వెంటనే గమనించిన స్థానికులు తాళ్ల సాయంతో ఆ మహిళను కాపాడారు. ఆమెను కాపాడేందుకు దాదాపుగా 40 నిమిషాల పాటు కష్టపడ్డారు. మహిళను ప్రాణాలతో బయట పడటంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరి పిల్చుకున్నారు.

వీడియో చూడండి… 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…