An Invaluable Invocation: ఆ పుస్తకం విలువ రూ.5 కోట్లు..! ఛారీటీ కోసమే అంత ధర పెట్టానంటున్న రచయిత
ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా ప్రపంచ శాంతి, సామరస్యాన్ని కాంక్షిస్తూ ఆంగ్లంలో“ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్” పేరిట సుదీర్ఘ భావ గీతాన్ని రచించారు. ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పుస్తక ఆవిష్కరణ సభ హైదరాబాద్‌లో జరిగింది. ఐపీఎస్ అధికారి సుమతి, ప్రముఖ సినీ రచయిత భారవి తదితరులు ఈ ఆవిష్కరణ సభలో పాల్గొన్నారు.

ఆ పుస్తకం ఖరీదు ఏకంగా 5 కోట్ల రూపాయలట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. అయితే అంత ధర నిర్ణయించడానికి ఓ కారణం కూడా ఉంది. మరో విశేషమేంటంటే.. ఆ 5 కోట్ల రూపాయల విలువైన పుస్తక రచయత తెలంగాణకు చెందిన వ్యక్తి. అసలింతకీ ఏంటా పుస్తకం.. ఎందుకంత ధర పెట్టారు.. అన్నింటికన్నా ముఖ్యంగా అంత ధర పెట్టి ఇప్పుడు ఆ పుస్తకాన్ని కొనేవాళ్లెవరు.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను తెలుసుకుందాం..
డాక్టర్ వంగీపురం శ్రీనాధాచారి. ఆంగ్ల ఉపన్యాసకునిగా, వ్యక్తిత్వ వికాస నిపుణిడిగా.. రచయితగా.. తెలంగాణ వాసులకే కాదు.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితం. ఇప్పటికే తన ఖాతాలో పలు గిన్నిస్ రికార్డులను వేసుకున్న ఆయన తాజాగా మరో విశేషమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా ప్రపంచ శాంతి, సామరస్యాన్ని కాంక్షిస్తూ ఆంగ్లంలో An Invaluable Invocation (“ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్”) పేరిట సుదీర్ఘ భావ గీతాన్ని రచించారు. ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పుస్తక ఆవిష్కరణ సభ హైదరాబాద్‌లో జరిగింది. ఐపీఎస్ అధికారి సుమతి, ప్రముఖ సినీ రచయిత భారవి తదితరులు ఈ ఆవిష్కరణ సభలో పాల్గొన్నారు.
మానవ జాతి ఐక్యత, భూమాత పరిరక్షణ, మానవ శక్తి సామర్థ్యాల గుర్తింపు, ప్రపంచ శాంతి ప్రయాణ సారాంశం తదితర అంశాలను సృశిస్తూ 10 అశ్వాశాలుగా ఈ పుస్తక ప్రయాణం సాగిందని రచయత వంగీపురం తెలిపారు. ఈ తరహా భావగీతాన్ని ఆంగ్లంలో ఇప్పటి వరకు ఏ ఒక్కరూ రాయలేదని, ఈ విశిష్ట పుస్తకాన్ని ఐక్యరాజ్య సమితికి అంకితమిస్తున్నానని, దీని ద్వారా వచ్చే మొత్తంలో 50 శాతం ఐక్యరాజ్య సమితికి, 25శాతం తెలంగాణ ప్రభుత్వానికి మిగిలిన 25 శాతం మొత్తాన్ని భారత ప్రభుత్వానికి అందిస్తామని ఆయన చెప్పారు. అందుకే ఈ పుస్తకం ధర రూ.5 కోట్లుగా నిర్ణయించామని, ప్రపంచ శాంతి, సామరస్యం పట్ల మక్కువ ఉన్న ప్రపంచ పౌరులందర్నీ చైతన్యం చేయడమే తన పుస్తక లక్ష్యమన్నారు వంగీపురం.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



