Andhra Pradesh: ఏపీకి ముఖం చాటేస్తున్న ఈశాన్య రుతుపవనాలు.. వర్షపాతం తక్కువగా నమోదు

ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉన్న సీజన్లో.. ఇప్పటికే ఈసారి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ అవి బలాన్ని పుంజుకోలేదు. దీంతో కేవలం కేరళ తమిళనాడులో రాష్ట్రాల్లోనే వర్షాలు కురిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్ గా మారతుండడం, ఎల్ నినో ఎఫెక్ట్  వర్షాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

Andhra Pradesh: ఏపీకి ముఖం చాటేస్తున్న ఈశాన్య రుతుపవనాలు.. వర్షపాతం తక్కువగా నమోదు
అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. ఇది సముద్రమట్టానికి 4.5 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ అధికారులు చెప్పారు.
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Surya Kala

Updated on: Oct 24, 2023 | 4:05 PM

నైరుతి లో వరుణుడు ఏపీలో అంతగా కరుణించ లేదు .. తెలంగాణలో కాస్త పరవాలేదనిపించినా.. ఈశాన్యమైనా ఏపీపై దయ తలుస్తుందా..? తమిళనాడు, కేరళలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. కానీ ఏపీలో ఇంకా ఉష్ణోగ్రతలే కొనసాగుతున్నాయి. నైరుతి విదిల్చిన లోటు వర్షపాతం ఈశాన్యం తీరుస్తుందా..? ఎప్పటినుంచి ఏపీలో వర్షాలు కురుస్తాయి..? మారిన వాతావరణ పరిస్థితులకు ఎల్ నినో ప్రభావమే కారణమా..? ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఎలా ఉండబోతోంది..?

రుతుపవనాల సీజన్ అనగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు.. తొలకరి పులకరించిన కాలం నుంచి శీతాకాలం మొదలయ్యే వరకు వర్షాలు కురుస్తూ ఉంటాయి. వాటిపైనే ఆధారపడి రైతులు ముందుకెళ్తారు. వేసవి సీజన్ ముగియగానే నైరుతి రుతుపవనాలు సీజన్ ప్రారంభమవుతుంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి సీజన్. ఆ తరువాత ఈశాన్య రుతుపవనాల సీజన్ ఆరంభమవుతుంది.

అయితే నైరుతిలో దాదాపుగా దేశవ్యాప్తంగా 75% వర్షాలు కురుస్తాయి. మిగిలిన 30 శాతం మాత్రమే ఈశాన్యంలో వర్షాలు పడతాయి. సాధారణంగా అక్టోబర్ 15 కల్లా.. దేశం నుంచి నైరుతి నిష్క్రమణం ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో ప్రవేశం జరుగుతూ ఉంటుంది. దేశవ్యాప్తంగా నైరుతి సీజన్ ఉంటే.. ఈశాన్య రుతుపవనాలు మాత్రం తమిళనాడు కేరళ పాండిచ్చేరి, కోస్తా రాయలసీమ జిల్లాలకు మాత్రమే పరిమితం అవుతుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ సీజన్ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

వాస్తవానికి ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి నైరుతి సీజన్ ముగిసే సమయానికి ఆరు శాతం వర్షపాతం తక్కువగా నమోదయింది. ఇది సాధారణం కంటే 19 శాతం తక్కువగా ఉంటున్నట్టు పరిగణిస్తారు నిపుణులు. కేరళ యూపీ దక్షిణ కర్ణాటక మణిపూర్ ఝార్ఖండ్ త్రిపుర నాగాలాండ్ పశ్చిమబెంగాల్ రాయలసీమ, బీహార్లలో సాధారణం కంటే తక్కువగాను.. పశ్చిమ రాజస్థాన్ సౌరాష్ట్ర అండమాన్ నికోబార్ దేవుళ్ళు సాధారణం కంటే 42 శాతం వరకు ఎక్కువగాను నమోదయింది. దేశం మొత్తం మీద 717 జిల్లాల్లో సగం వరకు సాధారణ వర్షపాతం నమోదు కాగా.. 29 శాతం జిల్లాల్లో వర్షపాతం తక్కువగా నమోదయింది.

వాస్తవానికి ఎల్ నినో ప్రభావం రుతుపవనంలో సీజన్ పై తీవ్ర ఎఫెక్ట్ చూపించింది. దీనికి తోడు అరేబియా మహా సముద్రంలో ఏర్పడిన బిపర్ జాయ్ తుఫాను కూడా రుతుపవనాల సీజన్లో కొన్ని రాష్ట్రాల్లో వర్షాలపై ఎఫెక్ట్ చూపించింది. ఏపీ పైన దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఈ ఏడాది వారం ఆలస్యంగా కేరళలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాల సీజన్లో ఈ ఏడాది దాదాపుగా 94 నుంచి 16% వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖలో అంచనా వేసింది. దీని ప్రకారం 94% వర్షపాతం నమోదయిందని ప్రకటించింది. అయితే సాధారణ వర్షపాతం కురిసిన.. తక్కువగానే వర్షాలు కురిసినట్టు విశ్లేషిస్తుంటారు. ఈ ఏడాది అల్పపీడనంలో వాయుగుండాలుగా మారి మొత్తం 14 ఏర్పడినప్పటికీ.. చాలా రాష్ట్రాల్లో వర్షాభావమే ఉంది.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో.. నైరుతి సీజన్ తెలంగాణలో పర్వాలేదు అనిపించింది. ఏపీలో మాత్రం లోటు వర్షపాతం నమోదయింది. దాదాపుగా 271 మండలాల్లో సాధారణంగా అంటే తక్కువ వర్షపాతం రికార్డ్ అయింది. వాస్తవానికి ఏపీలో నైరుతి సీజన్లో 521 మళ్లీ మడల వర్షం కురవాల్సి ఉంటుంది.. అయితే 13 శాతం తక్కువగా కేవలం 454 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదు అయింది. రాయలసీమలో 48 మిల్లీ మీటర్ల కురవాల్సి ఉండగా కేవలం 357 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. కోస్తా జిల్లాల్లో 61 మిల్లీ మీటర్లకు బదులు 538 మళ్లీ మీటర్లు అంటే 10 శాతం తక్కువ వర్షపాతం రికార్డు అయింది. ప్రధానంగా ఏపీలోని జిల్లాలో నెల్లూరు కర్నూలు ప్రకాశం అన్నమయ్య కాకినాడ తో పాటు అనంతపురం జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదు అయిందని నిపుణులు అంచనా వేశారు.

అయితే ప్రస్తుతం ఇప్పుడు ఈసారి ప్రారంభమైంది. ఏపీలో.. లోటు వర్షపాతం ఈశాన్యం తీరుస్తున్న అంటే దానిపైన సందేహమే. ఎందుకంటే ఇప్పటికే.. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఏపీపై వర్షాలు కురిపిస్తాయని భావించారు. రైతులు ఆశలు పెట్టుకున్నారు. కానీ వాతావరణ పరిస్థితులు నేపథ్యంలో వాతావరణ శాఖ అంచనా వేసినట్టుగానే.. దిశ మార్చుకొని బంగ్లాదేశ్ వైపు ప్రయాణిస్తుంది. దీంతో ఈశాన్య  రుతుపవనాల సీజన్ ప్రారంభంలోనే వర్షాలకు నిరాసే ఎదురయింది. కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో ఈశాన్య రుతుపవనాలు వర్షాలు కురిపిస్తున్నప్పటికీ.. ఏపీలో వర్షాలు కురిసే అంతగా బలం పుంజుకోలేదు. అందుకు వాతావరణ పరిస్థితిలో కారణమని నిపుణులు చెబుతున్నారు.

దీనికి తోడు.. ఏపీ కోస్తా తీరానికి సమీపంలో అల్పపీడనాలు వాయుగుండాలి ఏర్పడితేనే.. రుతుపవనాలు మరింత బలం పుంజుకుని ఏపీలో వర్షాలు కురిపిస్తాయి. సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి అల్పపీడనం ఏర్పడితే ఈశాన్య రుతుపవనాలు మారుతాయి. అయితే ఈసారి రుతుపవనాలు కేవలం దక్షిణాది రాష్ట్రాలపైనే కొన్ని ప్రాంతాల్లోనే ఎఫెక్ట్ చూపిస్తుంది. ఏపీలో కూడా.. దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాలపైనే ఈశాన్య రుతుపవనంలో ప్రభావం చూపుతాయి. వర్షాల కురిపిస్తాయి. అయితే నైరుతిలోనే 70 శాతం వరకు వర్షాలు కురుస్తాయి.. ఇక మిగిలిన 30% మాత్రమే ఈశాన్య రుతుపవనాల సీజన్లో వర్షాలు పడతాయి.

ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉన్న సీజన్లో.. ఇప్పటికే ఈసారి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ అవి బలాన్ని పుంజుకోలేదు. దీంతో కేవలం కేరళ తమిళనాడులో రాష్ట్రాల్లోనే వర్షాలు కురిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్ గా మారతుండడం, ఎల్ నినో ఎఫెక్ట్  వర్షాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అయితే.. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారి బంగ్లాదేశ్ తీరాన్ని దాటిన తర్వాత.. ఏపీపై ఈశాన్య రుతుపవనాలు కరుణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో వారం రోజుల తర్వాత ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఏపీలో ఉన్న లోటు వర్షపాతాన్ని ఈశాన్యం తీరుస్తాయా అంటే ప్రశ్నార్దకమే  అని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..