పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడు.. ధర్నాకు దిగిన ప్రియురాలు

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. కొంతకాలం కలిసి మెలిసి ఉన్నారు.. శారీరకంగా కలిశారు. ఓ పాప కూడా జన్మించింది. మోజు తీరిన తరువాత..పెళ్లి వద్దంటూ మాట దాటేశాడు సదరు ప్రేమికుడు. దీంతో మోసపోయానని గ్రహించిన ప్రియురాలు.. ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది.. తనకు న్యాయం చేయాలంటూ ధర్నా చేస్తోంది. ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడు.. ధర్నాకు దిగిన ప్రియురాలు
Girlfriend Went On Strike
Follow us
G Sampath Kumar

| Edited By: Jyothi Gadda

Updated on: Feb 01, 2025 | 1:23 PM

ప్రియుడి ఇంటి ముందు న్యాయం కోసం ధర్నాకు దిగింది ఓ ప్రియురాలు.. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని  మేడారంకు చెందిన ఆవుల శిరీష, బొట్ల వనపర్తి గ్రామానికి చెందిన రాచూరి వెంకటేష్ అనే వ్యక్తితో నాలుగు సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. తరువాత వారి పరిచయం ప్రేమ గా మారింది. కొన్ని రోజులు కలిసి మెలిసి తిరిగారు. అంతే కాకుండా మూడు సంవత్సరాల నుండి శిరీష.. వెంకటేష్ ఇంట్లోనే ఉంటుంది. వీరికి రెండేళ్ల పాప కూడా ఉంది. నాలుగు సంవత్సరాల నుండి పెళ్లి చేసుకుంటానని చెబుతూనే ఉన్నాడంటూ శిరీష వాపోయింది.

కానీ, పాప పుట్టిన తరువాత పెళ్లి విషయాన్నీ ప్రస్థావించలేదని చెప్పింది… పెళ్లి మాట తీయగానే మాట మారుస్తున్నాడని, అంతే కాకుండా తనను ఇంట్లో నుంచి గెంటి వేశాడని ఆరోపించింది.  తనతో ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తున్నాడంటూ బోరున విలపించింది.  ఈ బాధలన్నీ భరించలేక ప్రియురాలు.. ప్రియుడి ఇంటి ముందు కూర్చుని ధర్నా కు దిగింది. బాధితురాలికి మహిళా సంఘాలు కూడా మద్దతుగా నిలిచాయి.

ఈ విషయం తెలిసిన వెంకటేష్.. ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయాడు. అయితే, తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని ప్రియురాలు చెబుతుంది. వెంకటేష్.. పై పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయింది…పాప తో కలిసి అక్కడే ధర్నా చేస్తున్నారు. వెంకటేష్ మాత్రం ఇంటికి రావడం లేదు. కుటుంబ సభ్యులు కూడా ఇంట్లో లేరు. పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలనీ కోరుతున్నారు శిరీష…

ఇవి కూడా చదవండి