Wine Shops: ఎన్నికల వేళ తెలంగాణలోని మద్యం షాపులకు అబ్కారీ శాఖ కీలక ఆదేశాలు.. పూర్తి వివరాలు ఇవే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మద్యం షాపులకు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది అబ్కారీ శాఖ. అసలే ఇటు పోలింగ్‌కి సమయం దగ్గర పడుతోంది. ఆపై మద్యం పాలసీ గడువు కూడా ముగుస్తోంది. ఇలా రెండూ ఒకేసారి రావడం యాదృశ్చికమే అయినా దీని ప్రభావం మాత్రం సమాజంలో తీవ్రంగా చూపుతుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మద్యం షాపులకు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది అబ్కారీ శాఖ. అసలే ఇటు పోలింగ్‌కి సమయం దగ్గర పడుతోంది. ఆపై మద్యం పాలసీ గడువు కూడా ముగుస్తోంది. ఇలా రెండూ ఒకేసారి రావడం యాదృశ్చికమే అయినా దీని ప్రభావం మాత్రం సమాజంలో తీవ్రంగా చూపుతుంది. మద్యం పాలసీ విధానం డిశంబర్ 1 నాటికి ముగుస్తుండటంతో పాత స్టాక్‌ను తమ వద్ద ఉంచుకోకూడదు. అలా మిగిలిన మద్యం నిలువలను అబ్కారీ శాఖ సీజ్ చేస్తుంది. ఇది ఆ శాఖ పరిధిలోని నిబంధనల్లో ఒకటి. అంటే నవంబర్ 27 తోపాటూ నవంబర్ 30 సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల లోపూ విక్రయాలు జరపాలి. నవంబర్ 30వ తేదీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్నందున 28, 29 తేదీల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. దీని కారణంగా మద్యం షాపులు మూసివేయాల్సి ఉంటుంది. ఒక వేళ పాత స్టాక్ మిగిలిపోతుందన్న కారణంగా ఎమ్మార్పీ ధరల కంటే తక్కువకు మద్యం విక్రయించే అవకాశం ఉందని అబ్కారీ శాఖ అధికారులు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు.
డిశంబర్ 1వ తేదీ కొత్త లైసెన్స్‌కి దరఖాస్తు చేసుకున్న మద్యం షాపుల యాజమానులు గతంలో నిలువ ఉన్న మద్యం బాటిళ్లను ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకు అమ్మకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు అబ్కారీ శాఖ. ఇలా తనిఖీల్లో పట్టుబడితే రూ. 3లక్షల నుంచి రూ. 4లక్షల వరకూ జరిమానా విధిస్తామని ఉత్తర్వుల్లో తెలిపారు. ఒకవేళ నేరం రుజువైతే ఆరు నెలల పాటూ జైలు శిక్ష పడుతుందని మద్యం షాపు యాజమానులకు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 2620 మద్యం షాపులు ఉన్నట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. వీరందరికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది. ఎన్నికల సమయంలో మద్యంకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రజాస్వామ్యంలో స్వతంత్రంగా, స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. కానీ కొందరు నాయకులు తప్పుడు మార్గంలో ఓటర్లను మద్యం సీసాలకు, నోటు కట్టలను ప్రభావితం చేస్తూ ఓట్లను తమ వైపుకు ఆకర్షించుకుంటున్నారు. ఇలాంటి వారు ఈ పాలసీని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. మద్యం వ్యాపారుల వద్ద ఉన్న అధిక స్టాక్‌ను తక్కువ ధరలకు కొనుగోలు చేసి ఇలా ప్రలోభానికి గురి చేస్తారన్న ఆలోచనతో అబ్కారీ శాఖ ఈ అదేశాలను జారీ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




