AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGSPDCL: లంచగొండి విద్యుత్ సిబ్బంది, అధికారులపై ఇలా ఫిర్యాదు చేయండి..

Telangana News: మీరు తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులా? దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థకు చెందిన అధికారులు లేదా అధికారులు మిమ్మల్ని లంచం అడిగుతున్నారా? అయితే దీనిపై మీరు వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. లంచగొండి సిబ్బంది, అధికారులపై ఫిర్యాదులు స్వీకరించేందుకు సీఎండీ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

TGSPDCL: లంచగొండి విద్యుత్ సిబ్బంది, అధికారులపై ఇలా ఫిర్యాదు చేయండి..
TGSPDCL
Ashok Bheemanapalli
| Edited By: Janardhan Veluru|

Updated on: Sep 06, 2024 | 3:56 PM

Share

మీరు తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులా? దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థకు చెందిన అధికారులు లేదా అధికారులు మిమ్మల్ని లంచం అడిగుతున్నారా? అయితే దీనిపై మీరు వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. లంచగొండి సిబ్బంది, అధికారులపై ఫిర్యాదులు స్వీకరించేందుకు సీఎండీ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తమ సిబ్బంది లేదా అధికారులు ఏదైనా పనికి లంచం అడిగితే 040 – 2345 4884 లేదా 768 090 1912 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదుచేయాలని TGSPDCL చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖి ఓ ప్రకటనలో సూచించారు. విద్యుత్ పనులు పూర్తి చేసేందుకు వినియోగదారులను కొందరు సిబ్బంది, అధికారులు వేధిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.

తమ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేందుకు తమ సంస్థ అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నదని ముషారఫ్ ఫరూఖి తెలిపారు. అయితే కొంత మంది సిబ్బంది, అధికారులు అవినీతికి పాల్పడుతూ సంస్థకు చెడ్డపేరు తెస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల సమస్యలు/ఫిర్యాదులు నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సీఎండీ తెలిపారు. ఇప్పటికే నూతన సర్వీసుల మంజూరు, క్యాటగిరీ మార్పు, టైటిల్ ట్రాన్స్ ఫర్, బిల్లింగ్ లోపాలు వంటి ఇతర సేవలు పొందేందుకు సంస్థ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ల ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించబడింది.

సంస్థ పరిధిలో అవినీతి రహిత వాతావరణ కల్పించడానికి, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి సంస్థ కట్టుబడి వున్నదని తెలిపారు. సంస్థకు చెందిన సిబ్బంది, అధికారులు విద్యుత్ వినియోగదారులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడం, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని సీఎండీ ముషారఫ్ ఫరూఖి వార్నింగ్ ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి