AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Australia T20: జింఖానా గ్రౌండ్స్‌ దగ్గర ఉద్రిక్తత.. క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్ల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్‌.. అదుపుతప్పిన పరిస్థితి..

Hyderabad: జింఖానా గ్రౌండ్స్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. దాంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది.

India vs Australia T20: జింఖానా గ్రౌండ్స్‌ దగ్గర ఉద్రిక్తత.. క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్ల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్‌.. అదుపుతప్పిన పరిస్థితి..
Ticket Fight
Shiva Prajapati
| Edited By: |

Updated on: Sep 22, 2022 | 12:35 PM

Share

India vs Australia T20: జింఖానా గ్రౌండ్స్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. దాంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. లోపలికి వెళ్లేందుకు గేట్లు పగులగొట్టారు అభిమానులు. ఒకరినొకరు తోసుకుంటూ లోపలికి దూసుకెళ్లడంతో తొక్కీసలాట జరిగింది వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. లాఠీలకు పని చెప్పారు. అదుపుతప్పిన అభిమానులపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు.

ఉదయం పది గంటల నుంచి టికెట్ల సేల్‌ మొదలుపెట్టారు. అయితే రాత్రి నుంచి అభిమానులు జింఖాన్‌ గ్రౌండ్స్ బయట క్యూ కట్టారు. దాదాపు పదివేల మంది అభిమానులు ఉదయం నుంచి టికెట్ల కోసం క్యూలైన్‌లో నిల్చున్నారు. ఉదయం పదిన్నరకు కౌంటర్లు ఓపెన్‌ చేసిన నిర్వాహకులు.. ఒక్కసారి 20 మందిని మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు. ఇలా టికెట్ల అమ్మకాలు మెల్లగా సాగుతుండడంతో ఆగ్రహానికి గురైన అభిమానులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. గేట్లు పగులగొట్టేందుకు అభిమానులు ప్రయత్నించడంతో అభిమాలనుపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పింది. ఫోన్‌ పే, గూగుల్‌ పేకు అనుమతించడం లేదు. ఓన్లీ క్యాష్‌ పేమెంట్స్‌కు అనుమతించడంపై కూడా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. హైదరాబాద్‌ టీ20 ఫీవర్‌ మొదలైంది. జింఖానా గ్రౌండ్స్‌ టికెట్ల అమ్మకాలు మొదలయ్యాయి. మ్యాచ్‌ టికెట్ల కోసం అభిమానులు పోటెత్తారు. రాత్రి నుంచి టికెట్ల కోసం క్యూలో నిల్చున్న జనం.. టికెట్లు దొరకగానే ఖుషీ అయ్యారు. మొత్తం నాలుగు కౌంటర్లలో టికెట్లు అమ్ముతున్నారు. ఉదయం పదిన్నరకు ప్రారంభమైన టికెట్ల అమ్మకాలు రాత్రి ఏడు గంటల వరకు కొనసాగనుంది. ఒకరికి రెండు టికెట్లు మాత్రమే అమ్ముతున్నారు. ఆధార్‌ కార్డు జిరాక్స్‌ తో పాటు మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నెంబర్‌ ఉంటేనే టికెట్లు ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

షెడ్యూల్ ప్రకారం ఈనెల 25న ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్‌ జరుగనున్న విషయం తెలిసిందే. మూడేళ్ల తర్వాత మ్యాచ్‌ జరుగుతుండడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు 15 వేల టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్మినట్లు హెచ్‌సీఏ చెబుతోంది. ఇప్పుడు మరో 15 వేల టికెట్లు ఆఫ్‌లైన్‌లో అమ్ముతున్నట్లు చెబుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..