Karimnagar Car Accident : నలుగురు వ్యక్తులను మింగేసిన మృత్యుబావి.. కరీంనగర్ జిల్లాలో విషాదం
Karimnagar Car Accident: ఉమ్మడి కరీం నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చినముల్కనూరు శివారులో ఓ కారు అదుపు తప్పి వ్యాసాయ బావిలోకి దూసుకెళ్ళింది. కారు పూర్తిగా ఆ..
Karimnagar Car Accident: ఉమ్మడి కరీం నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చినముల్కనూరు శివారులో ఓ కారు అదుపు తప్పి వ్యాసాయ బావిలోకి దూసుకెళ్ళింది. కారు పూర్తిగా ఆ వ్యవసాయ బావిలోకి మునిగిపోయింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కారుని బావి నుంచి వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కకారులో ఉన్న వ్యక్తులు నలుగురు గల్లంతయ్యారు. దీంతో వారిని వెలికి తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ దారుణ ప్రమాదం కరీం నగర్ నుంచి హుస్నాబాద్ వెళ్తుండగా చినముల్కనూరు శివారులో చోటు చేసుకుంది. కారులో ఉన్నవారి వివరాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Also Read: Fried Food: స్మోకింగ్‌తో వచ్చే రోగాలకంటే.. డీప్ ఫ్రై చేసిన ఫుడ్ తింటే వచ్చే వ్యాధులే ఎక్కువ