AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఆఫ్ట్రాల్ ఏసీ టెక్నిషియన్ అనుకోకండి.. ఇంత పెద్ద టాలీవుడ్‌ను షేక్ చేశాడు

సినిమా రిలీజయ్యే రోజే టెలిగ్రామ్‌ గ్రూపుల్లో లీక్ చేస్తున్న కిరణ్‌కుమార్‌ను హైదరాబాద్‌లో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 65కు పైగా సినిమాలను పైరసీ చేసిన అతడు, ఒక్కో సినిమాకు 300 డాలర్లు వసూలు చేసేవాడిగా తేలింది. క్రిప్టో కరెన్సీలో కమిషన్లు తీసుకుంటూ నెలకు లక్షలోపల సంపాదించేవాడని అధికారులు వెల్లడించారు. ఫిలిం ఛాంబర్ ఫిర్యాదుతో పట్టుబడ్డ కిరణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పరిశ్రమ డిమాండ్ చేస్తోంది.

Tollywood: ఆఫ్ట్రాల్ ఏసీ టెక్నిషియన్ అనుకోకండి.. ఇంత పెద్ద టాలీవుడ్‌ను షేక్ చేశాడు
Accused Kiran Kumar
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Jul 03, 2025 | 4:07 PM

Share

తెలుగు చిత్రసీమను వణికిస్తున్న పైరసీ మాఫియాలో కీలక నిందితుడైన కిరణ్‌కుమార్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఏపీకి చెందిన నిందితుడు.. గతంలో ఏసీ టెక్నీషియన్‌గా పని చేస్తూ వెండితెరపై విడుదలవుతున్న సినిమాలను ఫోనుతో రికార్డ్ చేసి టెలిగ్రామ్‌ గ్రూపుల్లో షేర్ చేసే స్కామ్‌లోకి దిగాడు.

సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కిరణ్ ఇప్పటివరకు 65కి పైగా సినిమాలను పైరసీ చేశాడు. సినిమా విడుదలైన తరువాత రోజే టెలిగ్రామ్‌లో లీక్ చేస్తూ ఒక్కో సినిమాకు 300 డాలర్లు వసూలు చేసేవాడు. క్రిప్టో కరెన్సీ రూపంలో కమిషన్లు తీసుకుంటూ… నెలకు రూ.80 వేల వరకు సంపాదించేవాడు. ఈ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ యాంటీపైరసీ సెల్ ప్రతినిధి మణీంద్రబాబు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి.. కిరణ్‌ను అరెస్ట్ చేశారు.

తెలుగు ఫిలించాంబర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఏడాది పైరసీ వల్ల ఇండస్ట్రీకి దాదాపు రూ.3,500 కోట్ల నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. 2019 నుంచే ఈ పని చేస్తూ వస్తున్న కిరణ్‌కు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. వందల మంది కష్టంతో కోట్లు పెట్టి నిర్మిస్తున్న సినిమాలను పైరసీ చేస్తోన్న ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టాలీవుడ్ డిమాండ్ చేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?