Telangana: పతిదేవుడ్ని పైకి పంపించింది.. ఏమి తెలియనట్టుగా ప్రియుడితో కలిసి నంగనాచిలా..
భార్యే ఇన్సూరెన్స్ డబ్బులు, ఇంటి లోన్ మాఫీ కోసం భర్తను చంపించేసింది. ఈనెల 22న కేసముద్రం మండలం బోడ మంచ తండా దగ్గర్లో వీరయ్య శవం రోడ్డు పక్కన కనిపించింది. తలపై రాడ్‌తో కొట్టి చంపేసి ఆ తర్వాత దాన్ని బైక్ పైనుంచి పడితే జరిగిన ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే..

భర్తను వద్దనుకుంది.. ఆస్తిని మాత్రం కావాలనుకుంది. అందుకే ప్రియుడితో కలిసి ప్లాన్ చేసి కట్టుకున్న వాడిని చంపించింది. పోలీసులు విచారణ చేస్తే మొత్తం కుట్ర బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన దారుణమైన ఘటన ఇది. భార్యే ఇన్సూరెన్స్ డబ్బులు, ఇంటి లోన్ మాఫీ కోసం భర్తను చంపించేసింది. ఈనెల 22న కేసముద్రం మండలం బోడ మంచ తండా దగ్గర్లో వీరయ్య శవం రోడ్డు పక్కన కనిపించింది. తలపై రాడ్‌తో కొట్టి చంపేసి ఆ తర్వాత దాన్ని బైక్ పైనుంచి పడితే జరిగిన ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే.. పోలీసులు విచారణ మొదలుపెట్టేసరికి నిందితులు వీరన్న భార్య విజయ, ఆమె ప్రియుడు బాలాజీగా నిర్థారణకు వచ్చారు పోలీసులు. వాళ్లిద్దరికీ సహకరించిన భరత్‌ను కూడా అరెస్టు చేశారు. RMPగా చేస్తూ ఇన్యూరెన్స్ ఏజెంట్‌గా ఉన్న భరత్.. వీరన్నపై పాలసీ చేయించాడు.
ఆ డబ్బులు అలాగే హౌస్ లోన్ మాఫీ కోసం వీళ్లంతా కలిసి కుట్ర చేసి ఒక ప్రాణం తీశారు. చివరికి ఇప్పుడు ముగ్గురూ జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. వీరన్న చనిపోయినప్పుడు ఆయన భార్య ఏమీ తెలియనట్టే మాట్లాడింది. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తీరా చూస్తే చంపింది ఆమే అని తేలింది. వీరన్నను చంపింది బాలాజీ, భరత్ అని తెలిసి గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వాళ్ల ఇళ్ల ముందు ధర్నా చేసి.. ఆగ్రహం చల్లారక రాళ్లు రువ్వారు. ఫర్నీచర్ తగలబెట్టారు. ఓ బైక్‌కి కూడా నిప్పు పెట్టారు.దీంతో.. ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.పోలీసులు వచ్చి కంట్రోల్ చేస్తే తప్ప ఊరు మళ్లీ మామూలు స్థితికి రాలేదు. ఈ కేసులో నిందితులు ముగ్గురికీ కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకి తరలించారు.
