Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తాగునీటి కోసం అక్కడి చెంచుల కష్టాలు చెప్పతరమా..? ఓ స్వచ్చంద సంస్థ సహకారంతో ఇదిగో ఇలా

వేసవికాలంలో పిల్లలు ఆటపాటలతో కాలం గడుపుతుంటారు. ముఖ్యంగా చిన్నారులు తాటిబండ్లు, చిన్న డబ్బాలకు చక్రాలను ఏర్పాటు చేసుకుని లాగుతూ ఆట ఆడుకుంటారు. కానీ ఆ పల్లెలో చిన్నా పెద్ద తేడా లేకుండా డ్రమ్ములను లాగుతున్నారు. అందరూ ఆటలాడుకోవడానికి డ్రమ్ములను లాగుతున్నారంటే పొరపాటే. అయితే ఎందుకు ఈ డ్రమ్ములు లాగుతున్నారో తెలుసు కోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: తాగునీటి కోసం అక్కడి చెంచుల కష్టాలు చెప్పతరమా..? ఓ స్వచ్చంద సంస్థ సహకారంతో ఇదిగో ఇలా
Tribes
Follow us
M Revan Reddy

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 04, 2025 | 3:23 PM

వేసవికాలంలో చాలా మారుమూల గ్రామాల్లో నీటి ఎద్దడి ఉంటుంది. వేసవిలో దాహార్తిని తీర్చుకోవడానికి జనం నానా కష్టాలు పడుతుంటారు. మంచినీటిని తెచ్చుకోవడానికి మహిళలు మండుటెండలో నెత్తిన బిందె పెట్టుకొని మోసుకెళ్తుంటారు. ఎడ్ల బండ్లు, ఆటోలు ట్రాక్టర్ల ద్వారా సుదూర ప్రాంతాల నుండి తాగు నీటిని తెచ్చుకుంటారు.

నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని పలు గ్రామాలు చెంతనే కృష్ణమ్మ ఉన్నప్పటికీ.. తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేసిన నాగార్జునసాగర్ రిజర్వాయర్ వెనుక భాగాన చందంపేట మండలం ఉంటుంది. పక్కనే కృష్ణమ్మ ఉన్నా.. వేసవిలో తాగునీటికి కటకట తప్పడం లేదు. ప్రతి వేసవిలో మాదిరిగానే పాత తెల్దేవర్‌పల్లి గ్రామంలోని 10 చెంచు కుటుంబాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. గ్రామ శివారులోని వ్యవసాయ బోరు బావుల నుండి నీటిని తెచ్చుకోవడానికి చెంచులు అష్ట కష్టాలు పడుతున్నారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా నీటి కోసం కుటుంబం మొత్తం నెత్తిన బిందె పెట్టుకొని మోసుకెళ్లాల్సిందే. మండు వేసవిలో గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న వ్యవసాయ బోరు బావి నుండి నీటిని తెచ్చుకోవడానికి గ్రామస్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ పల్లెవాసులు పిల్లలు ఆటలాడుకునే మాదిరిగా ఉన్న ఆ వినూత్న పరికరంలో దాహార్తిని తీర్చు కుంటున్నారు. ఆర్‌టీడీ అనే స్వచ్ఛంద సంస్థ చెంచుల కోసం ప్రత్యేకంగా పరికరాన్ని తయారు చేయించారు. మండుటెండలో నెత్తిన బిందె పెట్టుకొని మహిళలు మోసుకెళ్లాల్సిన పని లేకుండా ఈ పరికరం ద్వారా ఓ డ్రమ్మును ముందుకు నెట్టుకుంటూ వెళ్లి నీటిని నింపుకొని తీసుకెళ్లొచ్చు. పాత తెల్దేవర్‌పల్లిలో సుమారు పది చెంచు కుటుంబాలకు ఆర్‌టీడీ సంస్థ నెట్టుకుంటూ వెళ్లే ఈ డ్రమ్ములను అందజేసింది. పిల్లలు ఆటాడుకునే మాదిరిగా ఉన్న ఈ డ్రమ్ములతో వేసవిలో దాహార్తిని తీర్చుకోవడానికి చెంచులు వినియోగిస్తున్నారు. గ్రామ శివారులోని వ్యవసాయ బోరుబావి నుంచి మంచినీటితో వేసవిలో దాహార్తిని తీర్చుకోవడానికి ఈజీగా ఈ డ్రమ్ములు ఉపయోగపడుతున్నాయని చెంచులు చెబుతున్నారు. తమ దాహార్తిని తీర్చుతున్న ఈ డ్రమ్ములను తయారీ చేయించిన ఆర్‌టీడీ సంస్థకు చెంచు కుటుంబాలు కృతజ్ఞతలు చెబుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..  

మీ డైట్‌ లో ఇవి ఉంటే పెళ్లి తర్వాత బరువు పెరగరు..!
మీ డైట్‌ లో ఇవి ఉంటే పెళ్లి తర్వాత బరువు పెరగరు..!
శని దోషానికి రాహువు అడ్డుకట్ట.. వారి జీవితం నల్లేరు మీద బండి నడకే
శని దోషానికి రాహువు అడ్డుకట్ట.. వారి జీవితం నల్లేరు మీద బండి నడకే
జ్వరం తగ్గాలని.. చిన్నారులకు అగర్‌బత్తితో వాతలు పెట్టి పెట్టి..
జ్వరం తగ్గాలని.. చిన్నారులకు అగర్‌బత్తితో వాతలు పెట్టి పెట్టి..
తండ్రిని చూసేందుకు వచ్చి, అనుమానాస్పద మృతి!
తండ్రిని చూసేందుకు వచ్చి, అనుమానాస్పద మృతి!
మహిళకు పంది కిడ్నీ అమర్చిన డాక్టర్లు..130 రోజుల తర్వాత ఏమైందంటే..
మహిళకు పంది కిడ్నీ అమర్చిన డాక్టర్లు..130 రోజుల తర్వాత ఏమైందంటే..
మీకు పీఎం కిసాన్‌ డబ్బులు రావడం లేదా? కారణాలు ఏంటో తెలుసా?
మీకు పీఎం కిసాన్‌ డబ్బులు రావడం లేదా? కారణాలు ఏంటో తెలుసా?
Viral Video: ఆ డెలివరీ వ్యాన్‌కు దెయ్యం పట్టినట్టుందిగా...
Viral Video: ఆ డెలివరీ వ్యాన్‌కు దెయ్యం పట్టినట్టుందిగా...
వామ్మో.. పగబట్టినట్టు పెళ్లి బృందంపై కందిరీగల దాడి .. వరుడు సహా
వామ్మో.. పగబట్టినట్టు పెళ్లి బృందంపై కందిరీగల దాడి .. వరుడు సహా
అమెరికాను దాటేసిన భారతీయ రైల్వే.. ఆ విషయంలో మనమే కింగ్..!
అమెరికాను దాటేసిన భారతీయ రైల్వే.. ఆ విషయంలో మనమే కింగ్..!
మొబైల్‌లో నెట్‌వర్క్‌ సరిగ్గా రావడం లేదా..? ఇలా చేయండి!
మొబైల్‌లో నెట్‌వర్క్‌ సరిగ్గా రావడం లేదా..? ఇలా చేయండి!