AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నాగార్జున సాగర్ బుద్ధ వనంలో ఘనంగా బుద్ధ ధాతువుల ప్రతిష్టాపన

మహా స్తూపం అంతర్భాగంలోని మహాయాన బౌద్ధ సంప్రదాయం ప్రకారం దాతు పూజ, బౌద్ధ ప్రార్ధనలతో ఆనంద ఉత్సవాలతో ప్రతిష్టించారు. బుద్ధ ధాతువు ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా బుద్ధునికి చెందిన ఆరు శారీరక ధాతువులతో పాటు గౌతమ బుద్ధుని అనుచరులైన సారీ పుత్ర, మొగ్గలాన , శివాలీ, అనిరుద్ధ, బకుల, ఉపాలి, ఆనంద సహా మయన్మార్ చెందిన దగోన్ అనే అరహతుల దాతువులను కూడా నిక్షిప్తం  చేశారు.

Telangana: నాగార్జున సాగర్ బుద్ధ వనంలో ఘనంగా బుద్ధ ధాతువుల ప్రతిష్టాపన
Budha Vanam
M Revan Reddy
| Edited By: |

Updated on: Oct 29, 2023 | 8:40 PM

Share

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నాగార్జున సాగర్ లో నిర్మించిన బుద్ధ వనంలో బుద్ధుని పరమ పవిత్రమైన దాతువుల ప్రతిష్టాపన ఉత్సవం ఘనంగా నిర్వహించారు. పూజ్య బిక్షువు డాక్టర్ అజాన్ విసియన్ నేతృత్వంలో బౌద్ద బిక్షువులు పవిత్రమైన దాతువుల ప్రతిష్టాపన చేశారు. ముంబైకి చెందిన బాలీవుడ్ నటుడు గగన్ మాలిక్ ఫౌండేషన్ అధ్యక్షులు గగన్ మాలిక్, ఇండోనేషియాకు చెందిన బున్టారియా టిగ్రీస్ , శీలా కుమార కోసన్, మిలియాన్ చంద్ర యానిలింల ద్వారా సేకరించిన బుద్ధుని, 8 మంది అరహతుల దాతువులను ప్రత్యేకంగా అలంకరించిన పగోడాలో బుద్ధవనం ఎంట్రెన్స్ ప్లాజా వద్ద బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్యకు అందించారు. మేళతాళాలు, కోలాటాలతో బౌద్ధ భిక్షువులు ముందుకు సాగగా ఊరేగింపుతో బుద్ధ ధాతువులను మహా స్తూపం వరకు తీసుకెళ్లారు.

మహా స్తూపం అంతర్భాగంలోని మహాయాన బౌద్ధ సంప్రదాయం ప్రకారం దాతు పూజ, బౌద్ధ ప్రార్ధనలతో ఆనంద ఉత్సవాలతో ప్రతిష్టించారు. బుద్ధ ధాతువు ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా బుద్ధునికి చెందిన ఆరు శారీరక ధాతువులతో పాటు గౌతమ బుద్ధుని అనుచరులైన సారీ పుత్ర, మొగ్గలాన , శివాలీ, అనిరుద్ధ, బకుల, ఉపాలి, ఆనంద సహా మయన్మార్ చెందిన దగోన్ అనే అరహతుల దాతువులను కూడా నిక్షిప్తం  చేశారు.

అత్యంత బౌద్ధ భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ ప్రతిష్ట ఉత్సవంలో బాలీవుడ్ నటుడు గగన్ మాలిక్, ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజశేఖర టండ్రు, నల్లగొండ కలెక్టర్ కర్ణన్, మహా బోధి బుద్ధ విహారకు చెందిన సంఘ పాల బిక్కు, ఇండోనేషియాకు చెందిన డిప్రిబాయ్, ఎడిజహాన్, ఐరవెంటో హర్ట్ంటూ, శ్రీమతులు యూనిలిం, మిలియానియా చంద్ర, ఎలైన్ ఓయూ, ఇంగ్రిడ సేటియాడి, లిడియా సూపర్మన్, లెన్ని , మొనీహు, టాన్జాయింగ్, విన్నా చంద్ర, దన్ కాంగ్హా, జర్మనీకి చెందిన వాలంటీన్లే, మైంపులే, పాల్గొన్నారని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో బుద్ధవనం విషయ నిపుణులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, కేకే రాజా, కొండా లక్ష్మీకాంత రెడ్డి, సబ్బతి విష్ణుమూర్తి, భారతీయ బౌద్ధ సంఘం అధ్యక్షులు పరంధాములు, విజయవాడ బుద్ధ విహార కార్యదర్శి శుభాకార్ మేడసాని, బుద్ధవనం ఓఎస్డి సుధన్ రెడ్డి, శ్యాంసుందర్రావు , డిఈలు దామోదర్ రెడ్డి,  శ్రీనివాస్ రెడ్డి , ఏఈ నాజీజ్, రామ్ కుమార్ పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..