AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో కేంద్ర సాయుధ బలగాలలో ఫ్లాగ్ మార్చ్

Hyderabad: హైదరాబాద్‌లో కేంద్ర సాయుధ బలగాలలో ఫ్లాగ్ మార్చ్

Ranjith Muppidi
| Edited By: |

Updated on: Oct 29, 2023 | 8:30 PM

Share

హైదరాబాద్ పోలీసులు కేంద్ర సాయుధ బలగాల సిబ్బందితో కలిసి ఆదివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సామాన్య ప్రజల్లో భద్రత, విశ్వాసాన్ని పెంపొందించేందుకే ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించినట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ శాండిల్య తెలిపారు.

రానున్న శాసనసభ ఎన్నికల సందర్భంగా.. హైదరాబాదు సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది.  ఇన్సిడెంట్ ఫ్రీ అండ్ ఫేర్‌గా ఎన్నికలు జరుపడమే లక్ష్యంగా హైదరాబాదు సిటీ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యా ఆదేశానుసారంగా నగరంలో సౌత్ వెస్ట్ డీసీపీ ఆధ్వర్యంలో షాహినాయత్ గంజ్ పోలీసు స్టేషన్ నుండి , సౌత్ జోన్ డీసీపీ అధ్వర్యంలో ఫలక్ నుమా పిఎస్ నుండి, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో బండ్లగూడా పి.ఎస్ నుండి, వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో జూబిలి హిల్స్ పి.ఎస్ నుండి , సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో ముషీరాబాద్ పిఎస్ నుండి, నార్త్ డీసీపీ, ఈస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో కేంద్ర బలగాలతో  ప్లాగ్ మార్చ్ నిర్వంచినారు.

ప్రజలకు తోడుగా మేమున్నాము అనే భరోసా ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.  పోలింగ్ సందర్భంగా ప్రజలు నిర్భయంగా బయటికి వెళ్లి ఓటు వేసేలా ప్రజల్లో చైతన్యం కల్పించినట్టు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఎవరైనా దాడులకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఎన్నికలు సజావుగా సాగేలా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published on: Oct 29, 2023 08:17 PM