Telangana: బీఆర్‌ఎస్‌లోకి రావాలని నాగంకు మంత్రుల ఆహ్వానం

Telangana: బీఆర్‌ఎస్‌లోకి రావాలని నాగంకు మంత్రుల ఆహ్వానం

Ram Naramaneni

|

Updated on: Oct 29, 2023 | 7:52 PM

నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించికపోవడంతో.. అసంతృప్తితో కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన నాగం జనార్థన్ రెడ్డి ఇంటికి వెళ్లారు మంత్రులు కేటీఆర్, హరీష్. ఆయన్ను పార్టీలోకి రావాలని సాదరంగా ఆహ్వానించారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మంత్రుల వెంట పలువురు BRS పార్టీ సీనియర్‌ నేతలు ఉన్నారు.

కాంగ్రెస్‌ నేత నాగం జనార్ధన్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు.. మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు. హైదరాబాద్‌లోని నాగం నివాసానికి వెళ్లిన మంత్రులు..ఈ మేరకు చర్చలు జరుపారు. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నాగర్ కర్నూల్ టికెట్ ఆశించినప్పటికీ.. కాంగ్రెస్‌ పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో నాగం అసంతృప్తిగా ఉన్నారు. దీంతో హస్తం పార్టీని వీడారు నాగం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి

Published on: Oct 29, 2023 07:48 PM