Viral: గాడిదపై వెళ్లి నామినేషన్‌.. వంశ పారంపర్య రాజకీయాలకు వ్యతిరేకంగా..వీడియో.

Viral: గాడిదపై వెళ్లి నామినేషన్‌.. వంశ పారంపర్య రాజకీయాలకు వ్యతిరేకంగా..వీడియో.

Anil kumar poka

|

Updated on: Oct 29, 2023 | 9:09 PM

సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌ వేసేందుకు కార్లలోనో, ట్రాక్టర్‌లలోనో, బైకులపైనో అనుచరులతో కలిసి ర్యాలీగా వెళ్తారు. కానీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రం బుర్హాన్‌పూర్‌ జిల్లాలోని బుర్హాన్‌పూర్‌ నియోజక వర్గ స్వతంత్ర అభ్యర్థి ప్రియాంక్‌ సింగ్ థాకూర్‌ ఏకంగా గాడిదపై వెళ్లి రిటర్నింగ్‌ అధికారికి తన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు.దేశంలో వంశ పారంపర్య రాజకీయాలకు వ్యతిరేకంగా తాను ఇలా చేశానని ప్రియాంక్ చెప్పారు.

సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌ వేసేందుకు కార్లలోనో, ట్రాక్టర్‌లలోనో, బైకులపైనో అనుచరులతో కలిసి ర్యాలీగా వెళ్తారు. కానీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రం బుర్హాన్‌పూర్‌ జిల్లాలోని బుర్హాన్‌పూర్‌ నియోజక వర్గ స్వతంత్ర అభ్యర్థి ప్రియాంక్‌ సింగ్ థాకూర్‌ ఏకంగా గాడిదపై వెళ్లి రిటర్నింగ్‌ అధికారికి తన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. దేశంలో వంశ పారంపర్య రాజకీయాలకు వ్యతిరేకంగా తాను ఇలా చేశానని ప్రియాంక్ చెప్పారు. దేశంలో చాలా వరకు వారసత్వ రాజకీయాలే నడుస్తున్నాయని, ఎక్కడ చూసినా కుటుంబాల్లోని తాతలు, తండ్రులు, మనుమలు మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతూ వస్తున్నారని, ప్రజాస్వామ్య దేశంలో ఇది మంచి సంప్రదాయం కాదని అన్నారు. వారసత్వంగా వస్తున్న అధికారంతో ఆ ప్రాంత ప్రజలను ఆ కుటుంబం గాడిదలను చేసి వాడుకుంటోందని ప్రియాంక్‌ సింగ్‌ మండిపడ్డారు. అందుకే వంశ పారంపర్య రాజకీయాలపై తన వ్యతిరేకతను చాటి చెప్పేందుకు ఇలా గాడిదపై వచ్చి నామినేషన్‌ వేశానని అన్నారు. కాగా ప్రియాంక్‌ సింగ్‌ గాడిదపై వెళ్లి నామినేషన్‌ వేసిన ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..