Viral: దొంగగా మారిన ఓ పోలీస్ కానిస్టేబుల్.. ఇదేం ట్విస్ట్ రా అయ్యా..! వీడియో వైరల్..

Viral: దొంగగా మారిన ఓ పోలీస్ కానిస్టేబుల్.. ఇదేం ట్విస్ట్ రా అయ్యా..! వీడియో వైరల్..

Anil kumar poka

|

Updated on: Oct 29, 2023 | 8:49 PM

రాను రాను పోలీసులే దొంగలుగా మారిపోతున్నారు. దొంగతనాలు, దోపిడీలకు పాల్పడేవారి తాట తీయాల్సిన పోలీసులే దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్ దొంగగా మారిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వాహనాల తనిఖీల పేరుతో ఏకంగా 18 లక్షల 50 వేల రూపాయలు దోపిడీకి పాల్పడ్డాడు. మెహదీపట్నంలోని ఓ టెక్స్‌టైల్స్‌ షాపులో ప్రదీప్‌ శర్మ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. అతను సదరు కంపెనీకి చెందిన 20 లక్షల రూపాయలను పంజాగుట్టలోని బ్యాంకులో డిపాజిట్‌

రాను రాను పోలీసులే దొంగలుగా మారిపోతున్నారు. దొంగతనాలు, దోపిడీలకు పాల్పడేవారి తాట తీయాల్సిన పోలీసులే దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో
ఓ పోలీస్ కానిస్టేబుల్ దొంగగా మారిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వాహనాల తనిఖీల పేరుతో ఏకంగా 18 లక్షల 50 వేల రూపాయలు దోపిడీకి పాల్పడ్డాడు. మెహదీపట్నంలోని ఓ టెక్స్‌టైల్స్‌ షాపులో ప్రదీప్‌ శర్మ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. అతను సదరు కంపెనీకి చెందిన 20 లక్షల రూపాయలను పంజాగుట్టలోని బ్యాంకులో డిపాజిట్‌ చేసేందుకు కంపెనీ కారులో వెళ్తున్నాడు. తాజ్‌ కృష్ణ వద్దకు రాగానే ఓ కానిస్టేబుల్‌, మరోవ్యక్తి పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనంలో వచ్చి ప్రదీప్‌శర్మ కారును అడ్డగించారు. కారును తనిఖీని చేయాలంటూ సోదాలు చేశారు. అందులో క్యాష్ దొరికింది. కారును తనిఖీ చేస్తుండగానే కారు వద్దకు ముఠాలోని మరి కొంతమంది సభ్యులు వచ్చారు. టెక్స్‌టైల్ ఉద్యోగి ప్రదీప్ శర్మ దృష్టి మళ్లించి కానిస్టేబుల్ అండ్ గ్యాంగ్ బ్యాగులో నగదు కొట్టేసింది. ఏకంగా 18 లక్షల 50,000 రూపాయలు కాజేసి కేవలం లక్షా 50 వేల రూపాయలు మాత్రమే తిరిగి ఇచ్చారు. యజమాని సూచన మేరకు పంజాగుట్ట పోలీసులకు ప్రదీప్ శర్మ ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. ఒకరిని అరెస్ట్ చేసి కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. కానిస్టేబుల్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సదరు కానిస్టేబుల్ ఓ ఇన్స్‌పెక్టర్ వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..