AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సర్కార్ కొలువుపై మనసుపడ్డ భార్య.. రాత్రి ఇంటికి వచ్చిన భర్తపై అటాక్.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్..

ఆయనో ప్రభుత్వ ఉద్యోగి.. ఇది బాగుంది. కానీ, బ్యాడ్ లక్ ఏంటంటే.. ఆయనో మద్యం బానిస. అదే అస్సలు బాలేదు. ఇంకేముంది.. పచ్చని సంసారంలో నిత్యం గొడవల చిచ్చే.

Telangana: సర్కార్ కొలువుపై మనసుపడ్డ భార్య.. రాత్రి ఇంటికి వచ్చిన భర్తపై అటాక్.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్..
Kothagudem Wife And Husband
Shiva Prajapati
|

Updated on: Jan 05, 2023 | 6:07 PM

Share

ఆయనో ప్రభుత్వ ఉద్యోగి.. ఇది బాగుంది. కానీ, బ్యాడ్ లక్ ఏంటంటే.. ఆయనో మద్యం బానిస. అదే అస్సలు బాలేదు. ఇంకేముంది.. పచ్చని సంసారంలో నిత్యం గొడవల చిచ్చే. అయితే, మద్యానికి బానిసైన భర్తతో ఇక లాభం లేదనుకుంది ఆయనగారి భార్య.. ఏదో ఒకటి చేసి ఆ ఉద్యోగం తాను పొందాలనుకుంది. ఇంకేముంది తన కన్నింగ్ మైండ్‌తో కంత్రీ ప్లాన్ వేసింది. అది అమలు కూడా చేసింది. కానీ ఆవిడ గారి ప్లాన్‌కు ఎండ్ కార్డ్ వేశారు పోలీసులు. రివర్స్‌ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు ఖాకీలు. దెబ్బకు దేవుడా అంటూ ఊచలు లెక్కిస్తోంది. ఇంతకీ ఏం జరిగింది? ఏక్కడ జరిగింది? ఎలా జరిగింది? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శ్రీనివాస్‌- సీతామహలక్ష్మి.. కొత్తగూడెంలో గాంధీనగర్‌లో ఉండేవాళ్లు. వీళ్లద్దరు.. వీళ్లకు ఇద్దరు పిల్లలు. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. శ్రీనివాస్‌ కొత్తగూడెం కలెక్టరేట్‌లో అటెండర్‌.. సర్కార్‌ కొలువు.. ఆర్ధికంగా ఎలాంటి ఢోకా లేదు. ఉన్నంతలో ఇంటిల్లిపాది హ్యాప్పీగా ఉండేవాళ్లు. ఇక వీళ్లద్దరయితే ఏక్‌ దూజే కే లియే అన్నంతగా కలిసి మెలిసి వుండేవాళ్లు. కొన్నాళ్లు అంతా ఆనందామానందమే. కానీ రాను రాను సీను మారింది. గొడవలు మొదలయ్యాయి. అందుకు కారణం.. మద్యం.

ఒకప్పుడు ఇద్దరూ ఎంతో సరదగా ఉండేవాళ్లు. ఎన్నో విషయాలు చర్చించుకునేవాళ్లు. పిల్లల చదువుల గురించి మాట్లాడుకునేవాళ్లు.. శ్రీనివాస్‌ మద్యానికి బానిసై బాధ్యతలను మరిచాడనే అసహనం ఆమెలో పెరిగింది. తాగి రావద్దని గొడవ పడటం.. పడిపోతే సపర్యలు చేయడం ఇదే కంటిన్యూ అయింది. కానీ, అతను ఎప్పట్లానే తాగొచ్చేవాడు. ఇటీవల కూడా అలాగే తాగొచ్చాడు. కుర్చీలో కూర్చుబెట్టి నీళ్లు తాగించింది. కట్‌ చేస్తే.. ఇరుగు పొరుగు వారిని పిలిచి శ్రీనివాస్‌ను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించింది. తాగిన మైకంలో జారిపడ్డాడు.. తలకు గాయమైందని చెప్పింది. డాక్టర్లు ట్రీట్‌మెంట్‌ చేశారు. కానీ ఫలితం దక్కలేదు. భర్త శ్రీనివాస్‌ చనిపోయాడు. ఇంతలో భార్య సీతామహాలక్ష్మి కనిపించకుండా పోయింది. దాంతో శ్రీనివాస్‌ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న సీతామహాలక్ష్మి హైదరాబాద్‌ వెళ్లేందుకు కొత్తగూడెం రైల్వేస్టేషన్‌లో వెయిట్‌ చేస్తున్నట్లు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకొని ఆరా తీస్తే.. షాకింగ్‌ ట్విస్ట్‌ తెరపైకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

శ్రీనివాస్‌ తాగొచ్చింది నిజమే. తలకు గాయం వల్ల చనిపోయింది నిజమే. కానీ గాయం అయింది మైకంలో జారి కిందపడటం వల్ల కాదు. సీతామహీలక్ష్మి కొట్టడం వల్ల. ఎందుకు కొట్టిందనేది ఇక్కడ మరో బిగ్ ట్విస్ట్. తాగి వేదిస్తున్నాడనే కోపం ఒక్కటే కాదు.. మరో కుట్ర కోణం కూడా బయటపడింది. శ్రీనివాస్‌ ప్రభుత్వ ఉద్యోగి. అతను చనిపోతే కారుణ్య కోటాలో తనకు సర్కార్‌ కొలువు వస్తుందనేది సీతామహాలక్ష్మి ఐడియా. కుట్ర అదిరింది. కానీ చివరకు ప్లాన్‌ బెడిసికొట్టింది. నిందితురాలు సీతామహాలక్ష్మి తాను చేసిన నేరం అంగీకరించడంతో ఆమె అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం కటకటాలబాటపట్టించారు. సర్కార్‌ కొలువు కోసం భర్తను కడతేర్చిన ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..