Hyderabad: దోపిడి దొంగల బీభత్సం.. కానిస్టేబుళ్లపై తల్వార్‌తో దాడి చేసిన దుండగులు..
రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. అర్ధరాత్రి దోపిడీలకు పాల్పడటమే కాకుండా.. ఏకంగా ప్రాణాలు తీస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. అర్ధరాత్రి దోపిడీలకు పాల్పడటమే కాకుండా.. ఏకంగా ప్రాణాలు తీస్తున్నారు. చివరికి పోలీసులను కూడా చంపేందుకు వెనుకాడటం లేదీ గ్యాంగ్. ఈ ముఠా గురించి ఆరా తీసేందుకు వెళ్లిన కూకట్‌పల్లి పోలీసులపై దాడికి దిగారు. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు.
ఔటర్ సర్వీస్ రోడ్ మైసమ్మ దేవాలయం సమీపంలో బైక్ పై వెళ్తున్న వారిపై అర్ధరాత్రి తల్వార్లతో దాడి చేశారు దుండగులు. ఈ దాడిలో గంధంగూడకు చెందిన కిషోర్ మృతి చెందగా, తులసి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వారి దగ్గర నుంచి రూ.15 వేలు నగదును తీసుకుని పరారయ్యారు.
ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు.. జగద్గిరిగుట్ట సిక్కుల బస్తీకి వెళ్లారు ఇద్దరు కానిస్టేబుళ్లు రాజు, విజయ్. వీరిద్దరిపై దుండగుడు సర్దార్ కరణ్ సింగ్ తల్వార్‌తో దాడిచేశాడు. కానిస్టేబుల్ రాజు ఛాతీలో పొడవడంతో అతని పరిస్థితి విషమంగా ఉంది. మరో కానిస్టేబుల్ విజయ్ తలపై గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అడిషనల్ డీసీపీ రవికుమార్.. హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని.. కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




