AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కాలేజీ విద్యార్థినులకు అసభ్య మెసేజ్‌లు, ఫోటోలు.. కట్టలుతెంచుకున్న ఆగ్రహం.. ఏకంగా..

ఘట్‌కేసర్‌లోని విజ్ఞానభారతి విద్యార్థులకు అసభ్యమెసేజ్‌లు, అభ్యంతకర ఫొటోలు పంపి వేధిస్తోన్న ఓ సైబర్‌ నేరగాడిని శిక్షించాలంటూ ఆందోళనకు దిగారు కళాశాల విద్యార్థులు.

Hyderabad: కాలేజీ విద్యార్థినులకు అసభ్య మెసేజ్‌లు, ఫోటోలు.. కట్టలుతెంచుకున్న ఆగ్రహం.. ఏకంగా..
Hyderabad College
Shiva Prajapati
|

Updated on: Jan 05, 2023 | 6:42 PM

Share

ఘట్‌కేసర్‌లోని విజ్ఞానభారతి విద్యార్థులకు అసభ్యమెసేజ్‌లు, అభ్యంతకర ఫొటోలు పంపి వేధిస్తోన్న ఓ సైబర్‌ నేరగాడిని శిక్షించాలంటూ ఆందోళనకు దిగారు కళాశాల విద్యార్థులు. అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్‌ చేసి, సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న ఆగంతకుడి వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడంతో విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.

విద్యార్థుల ఫొటోలు మార్ఫింగ్‌ చేసి, న్యూడ్‌ ఫొటోలతో బెదిరింపులకు పాల్పడుతున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. వాట్సాప్‌లో న్యూడ్‌ కాల్స్‌ చేయాలంటూ బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన విద్యార్థులు 100 కి డయల్‌ చేసి, పోలీసులకు పిర్యాదు చేయడంతో పోలీసులు స్పందించారు. కళాశాలకు వెళ్ళి, కేసునమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

మరోవైపు గత పదిరోజులుగా ఈ తతంగం జరుగుతున్నా పట్టించుకున్న నాథుడులేడంటూ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఓ విద్యార్థిని విడుదల చేసిన ఆడియో క్లిప్పింగ్‌ ఇప్పుడు సర్వత్రా కలకలం రేపుతోంది.

ఇవి కూడా చదవండి

ఘట్కేసర్.. ఔషపూర్ గ్రామ పరిధిలో ని విజ్ఞాన్ భారతి ఇన్‌స్టిట్యూషన్ లో బీటెక్‌ విద్యార్థిని ఫోటోలు మార్ఫింగ్‌ చేసి, వేధింపులకు గురిచేస్తున్న ఆగంతకుడి వ్యవహారం కళాశాలలో కలకలం రేపింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి విద్యార్థుల ప్రొఫైల్‌ పిక్చర్స్‌ని మార్ఫింగ్‌ చేసి విద్యార్థులకు పంపి బ్లాక్‌ మెయిల్‌ కి పాల్పడుతున్నాడు. పిల్లలు ఫోన్‌ ఎత్తాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎవ్వరికీ చెప్పుకోలేక.. తమలో తాము వేదన పడుతున్నారు విద్యార్థులు. తమ పిల్లలకు రక్షణ కల్పించాలని, నిందితులను పట్టుకోవాలని కోరుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.

ఓ అమ్మాయి ఫోన్ హ్యాక్‌ చేసి ఆ కాంటాక్ట్స్‌తో వేధింపులు పాల్పడుతున్నాడు ఓ అజ్ఞాతవ్యక్తి. పోలీసులకు కంప్లైంట్ చేశారని తెలిసి అమ్మాయిలకు వార్నింగ్‌ కూడా ఇచ్చాడు. గత కొద్దిరోజులుగా ఈ వ్యవహారం జరుగుతున్నా పట్టించుకున్న నాథుడు లేడు. దీంతో విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..