Rain Alert: ద్రోణి ఎఫెక్ట్.. వచ్చే 2 రోజులు ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలెర్ట్
వర్షాలు తెలుగు రాష్ట్రాలను వీడట్లేదు. ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరి ఆ వాతావరణ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.

దక్షిణ ఛత్తీస్గడ్ నుంచి తెలంగాణ రాయలసీమ అంతర్గత తమిళనాడుల మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిమీ ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల తెలంగాణలోని 12 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. గురువారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇది చదవండి: పాత బంగారాన్ని ఇచ్చి కమ్మలు కొంటానంది.. కట్ చేస్తే.. తను ఏం చేసిందంటే
అలాగే శుక్రవారం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఏపీ విషయానికొస్తే.. ద్రోణి ప్రభావంతో గురువారం ఉత్తరాంధ్ర, రాయలసీమలోని అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది.
ఇది చదవండి: చిత్తు కాగితాలు అనుకునేరు.. 30 ఏళ్ల క్రితం రూ. వెయ్యి.. ఇప్పుడు రూ. 1.83 కోట్లు








