AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JNV Admissons 2026: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాల దరఖాస్తులపై కీలక అప్డేట్.. ఇంతకీ సంగతేమంటే?

2026-27 విద్యా సంవత్సరానికి 9వ, 11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ (లేటరల్‌ ఎంట్రీ)కి సంబంధించి ఇటీవల జేఎన్‌వీ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు దరఖాస్తు గడువు సెప్టెంబర్‌ 23తో ముగిసింది. దీనిని అక్టోబర్‌ 7 వరకు..

JNV Admissons 2026: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాల దరఖాస్తులపై కీలక అప్డేట్.. ఇంతకీ సంగతేమంటే?
Navodaya Class 9 And 11 Admissions
Srilakshmi C
|

Updated on: Oct 09, 2025 | 7:49 AM

Share

హైదరాబాద్‌, అక్టోబర్ 9: నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 9వ, 11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ (లేటరల్‌ ఎంట్రీ)కి సంబంధించి ఇటీవల అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు దరఖాస్తు గడువు సెప్టెంబర్‌ 23తో ముగిసింది. దీనిని అక్టోబర్‌ 7 వరకు పొడిగిస్తూ గతంలో ప్రకటన వెలువరించింది. ఇటీవల ఈ గడువు కూడా ముగియడంతో మరోమారు దరఖాస్తు పొడిగించింది. తాజాగా దరఖాస్తు గడువును అక్టోబర్‌ 21, 2025వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది.

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడమే లక్ష్యంగా యేటా దేశ వ్యాప్తంగా ఉన్న 653 జేఎన్‌వీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా మాత్రమే వీటిల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య, వసతి సౌకర్యాలు అందిస్తారు. దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు తప్పనిసరిగా తాను చదివే జిల్లాకు చెందిన స్థానిక విద్యార్థి అయి ఉండాలి. అలాగే 2025-26 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఎనిమిదో తరగతి, పదో తరగతి చదువుతున్న వారు మాత్రమే అర్హులు. తప్పనిసరిగా మే 1, 2011 నుంచి జులై 31, 2013 మధ్య జన్మించి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఆన్‌లైన్‌ విధానంలో గడువు సమయంలోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.

ప్రవేశ పరీక్ష ఎలా ఉంటుందంటే..

ప్రవేశ పరీక్ష మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలకు 100 మార్కులకు ఉంటుంది. 2.30 గంటల సమయంలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. పరీక్ష క్వశ్చన్‌ పేపర్‌ ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది. ఇక రాత పరీక్ష వచ్చే ఏడాది (2026) ఫిబ్రవరి 7వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. నెగెటివ్‌ మార్కులు లేవు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.