RRB NTPC 2025 Exam: మరో 4 రోజుల్లో ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ రాత పరీక్ష.. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే
RRB NTPC UG 2025 CBT 2 Admit Card Download: రైల్వేలో ఎన్‌టీపీసీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సీబీటీ 1 పరీక్ష ముగియగా.. అందులో అర్హత సాధించిన వారికి సీబీటీ 2 పరీక్ష నిర్వహించేందుకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) సిద్ధమైంది..

హైదరాబాద్, అక్టోబర్ 9: ఇండియన్ రైల్వేలో ఎన్‌టీపీసీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సీబీటీ 1 పరీక్ష ముగియగా.. అందులో అర్హత సాధించిన వారికి సీబీటీ 2 పరీక్ష నిర్వహించేందుకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) సిద్ధమైంది. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను రైల్వే బోర్డు విడుదల చేసింది కూడా. ఇక తాజాగా అడ్మిట్ కార్డులను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ మేరకు గురువారం (అక్టోబర్ 9) ప్రకటన వెలువరించింది. సెకండ్ స్టేజ్ కంప్యూటర్ ఆధారిత పరీక్షకు ఎంపికైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.క ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ రాత పరీక్ష అక్టోబర్ 13న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనుంది.
కాగా భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 8,113 గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల సీబీటీ 1 రాత పరీక్ష ప్రాథమిక కీ, కట్‌ఆఫ్ మార్కుల వివరాలను బోర్డు విడుదల చేసింది. ఫలితాలు సెప్టెంబర్ 19న ప్రకటించింది. సీబీటీ 2 రాత పరీక్ష పూర్తయిన తర్వాత అక్టోబర్ 3వ వారంలో ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపింది.
ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్ష అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరోవైపు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 2025 సంవత్సరానికి దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో 8,050 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు అక్టోబర్ 21 నుంచి ప్రారంభమవుతాయి. ఇక అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు అక్టోబర్ 28, 2025 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




