AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Traffic Challans: వాహనదారులకు అలర్ట్‌.. నేటితో ఆఫర్ క్లోజ్.. మళ్లీ పొడిగించేది లేదంటున్న తెలంగాణ ట్రాఫిక్ పోలీస్

TS Traffic Challans: వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను వసూలు చేసుకునేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు(Telangana Traffic police)..

TS Traffic Challans: వాహనదారులకు అలర్ట్‌.. నేటితో ఆఫర్ క్లోజ్.. మళ్లీ పొడిగించేది లేదంటున్న తెలంగాణ ట్రాఫిక్ పోలీస్
Subhash Goud
|

Updated on: Apr 15, 2022 | 10:49 AM

Share

TS Traffic Challans: వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను వసూలు చేసుకునేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు(Telangana Traffic police) అమలు చేస్తున్న రాయితీ ఐడియాకు భారీ స్పందన వస్తోంది. పెండింగ్‌ చలాన్లపై రాయితీ మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు ఉండగా, దానిని మరో పదిహేను రోజులు అంటే ఏప్రిల్‌ 15వ తేదీ వరకు పొడిగించారు ట్రాఫిక్‌ పోలీసులు. అయితే నేటితో పెండింగ్‌ చలాన్లు రాయితీ గడువు ముగియనుంది. ప్రభుత్వం కల్పించిన ఆఫర్‌తో చలాన్లను(Challans) క్లియర్ చేసుకోవాలని భావిస్తున్నారు. మొదట్లో చలాన్లు కట్టేందుకు వాహనదారులు భారీగా రావడంతో.. సర్వర్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో సర్వర్ లో సాంకేతిక సమస్యలు(Technical Problems in Survers) తలెత్తి, సేవలు నిలిచిపోయాయి. తర్వాత సర్వర్ల సామర్థ్యం పెంచడంతో వేగవంతమైంది. ఆఫర్ ప్రారంభమైన నాటి నుంచి వెబ్ సైట్ ద్వారా రుసుములు చెల్లించేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు. వాహన చోదకుల విజ్ఞప్తుల నేపథ్యంలో మరో పదిహేను రోజులు పొడిగించారు. నేటితో ఈ గడువు ముగియడంతో పెండింగ్‌ చలాన్లు ఉన్నవారు చెల్లించేసుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచిస్తున్నారు.

గడువులోగా చెల్లించకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే:

రాయితీ వర్తింపు గడువులోగా చలాన్లు క్లియర్ చేసుకోలేకపోతే తర్వాత భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఈ రోజు చివరి తేదీ ఉండటంతో ట్రాఫిక్‌ పోలీసులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పెండింగ్‌లో ఉన్న చలాన్లను కట్టుకోవాలని పదేపదే సూచిస్తున్నారు. గడువు ముగిసిన తర్వాత ప్రస్తుతం ఉన్న చలానాలకు రాయితీ ఇవ్వమని పూర్తి డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇంతవరకూ చలాన్లు చెల్లించలేక పోయినవారు ఈ రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ-చలాన్ వెబ్‌సైట్‌లో, ఆన్‌లైన్‌ పేమెంట్ ద్వారా తమ చలాన్ క్లియర్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఇప్పటి వరకు రూ. 250 కోట్ల ఆదాయం

కాగా, ఇప్పటి వరకు 60 శాతం ట్రాఫిక్‌ చలానాలు క్లియర్‌ అయినట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు చలానాల రూపంలో ప్రభుత్వానికి రూ.250 కట్ల ఆదాయం వచ్చినట్లు ట్రాఫిక్‌ పోలీసు అధికారులు తెలిపారు. ట్రాఫిక్‌ చలానాలు చెల్లించేందుకు గడువు నేటితో ముగియనుండంతో పెండింగ్‌ చలనాలు భారీగా వచ్చే అవకాశాలున్నాయని ట్రాఫిక్‌ పోలీసులు భావిస్తున్నారు. గడువు ముగిసిన తర్వాత రేపటి నుంచి అంటే ఏప్రిల్‌ 16వ తేదీ నుంచి యధావిధిగా చలాన్‌ రుసుము విధించనున్నారు ట్రాఫిక్‌ పోలీసులు. ఏప్రిల్‌ 15 వరకు గడువు పొడిగించడంతో ఆఫర్‌పై భారీ స్పందన వచ్చిందని పేర్కొన్నారు. అయితే మరోసారి ఆఫర్‌ పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు.

రాయితీ దేనికి ఎంత..?

☛ టువీలర్/త్రీవీలర్ కట్టాల్సింది: 25%, రాయితీ 75 శాతం.

☛ ఆర్టీసీ బస్సు డ్రైవర్స్ కట్టాల్సింది 30 శాతం, రాయితీ 70 శాతం.

☛ లైట్ మోటార్ వెహికల్స్/హెవీ మోటర్ వెహికల్స్ కట్టాల్సింది: 50 శాతం, రాయితీ 50 రాయితీ

☛ తోపుడు బండ్ల వ్యాపారులు కట్టాల్సింది 20 శాతం, రాయితీ 80 శాతం.

☛ నో మాస్క్ ఫైన్‌కు కట్టాల్సింది: రూ.100, రాయితీ 90 శాతం.

ఇవి కూడా చదవండి:

Owaisi Convoy: ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీకి చేదు అనుభవం.. కాన్వాయ్‌ని అడ్డుకున్న ఆందోళనకారులు

Telangana RTC: తెలంగాణ ఆర్టీసీ వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌.. కార్మికులకు తీపి కబురు