AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Owaisi Convoy: ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీకి చేదు అనుభవం.. కాన్వాయ్‌ని అడ్డుకున్న ఆందోళనకారులు

Owaisi Convoy: ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీకి చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒవైసీ కాన్వాయ్‌ను అడ్డుకుని నల్లజెండాలు ప్రదర్శించారు..

Owaisi Convoy: ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీకి చేదు అనుభవం.. కాన్వాయ్‌ని అడ్డుకున్న ఆందోళనకారులు
Subhash Goud
|

Updated on: Apr 15, 2022 | 7:20 AM

Share

Owaisi Convoy: ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీకి చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒవైసీ కాన్వాయ్‌ను అడ్డుకుని నల్లజెండాలు ప్రదర్శించారు గుజరాత్ ముస్లింలు. అహ్మదాబాద్‌లో ఆందోళనకారులు నల్లజెండాలు చూపించి ఓవైసీ గో బ్యాక్, ఓవైసీ వపాస్ జావ్ ఓవైసీ బీజేపీ ఏజెంట్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హైదరాబాద్‌ ఎంపీ ఇఫ్తార్‌ కార్యక్రమానికి బయలుదేరుతుండగా అహ్మదాబాద్‌లో అసదుద్దీన్‌ ఒవైసీ (Asaduddin Owaisi) కాన్వాయ్‌ (Convoy)కు నల్లజెండాలు చూపించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న గుజరాత్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఏఐఎంఐఎం కార్యకర్తలు నేతలతో సమావేశం అయ్యేందుకు ఒవైసీ అహ్మదాబాద్ నగరానికి వచ్చారు.

ఒవైసీ కారు లో ఇఫ్తార్‌ కార్యక్రమానికి బయలుదేరుతుండగా, పలువురు నల్లజెండాలు చేతబట్టుకుని ఆయన కాన్వాయ్‌ ముందు వచ్చి కొద్దిసేపు కార్ల రాకపోకలను నిలిపివేశారు. ఒవైసీ తన కారులో కూర్చొని వెళుతున్న సమయంలో నిరసనకారులు అతని వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒవైసీ వాపస్ జావో అని రాసి ఉన్న బ్యానర్లను కూడా ఆందోళనకారులు ఓవైసీకి చూపించారు ఆందోళనకారుల మధ్య లో నుంచి ఓవైసీ ప్రయాణిస్తున్న వాహనం పోలీస్ మజ్లీస్ కార్యకర్తల సహాయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి:

Telangana RTC: తెలంగాణ ఆర్టీసీ వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌.. కార్మికులకు తీపి కబురు

Summer Special Trains: వేసవి సెలవుల రద్దీ.. తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని స్పెషల్‌ రైళ్లు.. పూర్తి వివరాలివే..