Telangana RTC: తెలంగాణ ఆర్టీసీ వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌.. కార్మికులకు తీపి కబురు

Telangana RTC: ఒకవైపు ఛార్జీల పెంపు తర్వాత ఆర్టీసీని లాభాల బాట పట్టించడం కోసం కసరత్తు చేస్తున్నారు తెలంగాణ ఆర్టీసీ అధికారులు. వంద..

Telangana RTC: తెలంగాణ ఆర్టీసీ వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌.. కార్మికులకు తీపి కబురు
Follow us
Subhash Goud

|

Updated on: Apr 15, 2022 | 6:48 AM

Telangana RTC: ఒకవైపు ఛార్జీల పెంపు తర్వాత ఆర్టీసీని లాభాల బాట పట్టించడం కోసం కసరత్తు చేస్తున్నారు తెలంగాణ ఆర్టీసీ అధికారులు. వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. మరోవైపు అటు కార్మికులకు కూడా తీపి కబురు అందించారు. తెలంగాణలో ఆర్టీసీ (RTC)ని బాగు చేయడం కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతున్నారు అధికారులు. 2022- 2023 తెలంగాణ ఆర్టీసికి గోల్డెన్‌ ఇయర్‌ అవుతుందని చెబుతున్నారు. ఆర్టీసీని ఎలాగైనా లాభాలబాట పట్టించడం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. ఆర్టీసీ బాగు కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదంటున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (MD Sajjanar). ఆర్టీసీని లాభాల బాట పట్టించడం కోసం ఆర్టీసీ ఉద్యోగులు బాగా కష్టపడుతున్నారని కితాబిచ్చారు. ప్రస్తుతం ఆర్టీసీ మెరుగైన ఫలితాలు సాధిస్తోందన్నారు. వచ్చే 2022-2023 ఆర్టీసీకి గోల్డెన్ ఇయర్ అవుతుందన్నారు సజ్జనర్. ఆర్టీసీ ఎండిగా బాధ్యతలు చేపట్టాక అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు సజ్జనార్‌. దీంతో ఇప్పటికే మెరుగైన ఫలితాలు సాధిస్తోంది ఆర్టీసీ. ఇక రానున్న రోజుల్లో కూడా మరింత మెరుగైన ఫలితాలు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు సజ్జనార్‌.

ప్రస్తుతం ఆర్టీసీలో వంద రోజుల యాక్షన్ ప్లాన్‌తో నడుస్తోందని, తప్పకుండా రానున్న రోజుల్లో ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ డీఏలు టీఎలు అందుతాయని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఆర్టీసీ చైర్మన్, ఆర్టీసీఎండీ కార్మికులకు తీపి కబురు అందించారు.

ఇవి కూడా చదవండి:

Deliveroo: హైదరాబాద్ కు అంతర్జాతీయ ఫుడ్ డెలివరీ యాప్.. ఆ నైపుణ్యాలు ఉన్న వారికి కొత్తగా ఉద్యోగాలు..

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి ఎన్ని ప్రయోజనాలో.. లోన్ ఆఫర్లు, టాక్స్ సేవింగ్స్.. ఇంకెన్నో..