TSRTC Offer: ప్రాణహిత పుష్కరాల వేళ టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఏకంగా ఇంటి వద్దకే..

TSRTC Offer: ప్రాణహిత పుష్కరాలకు వెళ్తున్నారా ? అయితే మీ ఇంటి దగ్గరకే బస్సు వస్తుంది. అయితే దీనికి కొన్ని షరతులున్నాయి. అవి ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.

TSRTC Offer: ప్రాణహిత పుష్కరాల వేళ టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఏకంగా ఇంటి వద్దకే..
Tsrtc
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 15, 2022 | 6:05 AM

TSRTC Offer: ప్రాణహిత పుష్కరాలకు వెళ్తున్నారా ? అయితే మీ ఇంటి దగ్గరకే బస్సు వస్తుంది. అయితే దీనికి కొన్ని షరతులున్నాయి. అవి ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ప్రాణహిత పుష్కరాలను నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. భక్తుల కోసం అన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఆర్టీసీ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకువస్తోంది.

ఈనెల 13వ తేదీ నుంచి మొదలైన ప్రాణహిత పుష్కరాలు 24వ తేదీ వరకు కొనసాగనున్నాయి. తాజాగా ప్రాణహిత పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది తెలంగాణ ఆర్టీసీ. భక్తులను పుష్కరఘాట్లకు చేర్చేందుకు 200 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి 200 స్పెషల్ బస్సులను నడపుతోంది. అయితే, 30 మంది భక్తులు ఉంటే ఇంటికే బస్సులను పంపిస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతో ఒక కాలనీ నుంచి లేదా ఒక ఏరియా నుంచి ఒకేసారి 30 మంది భక్తులు వెళ్తే వారి దగ్గరికే ఆర్టీసీ బస్సు రానుంది. ఇంటి దగ్గరి నుంచి నేరుగా పుష్కర ఘాట్‌ వరకు తీసుకెళ్తారు.

మరోవైపు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట దగ్గర ప్రారంభమైన ప్రాణహిత పుష్కరాల్లో ప్రత్యేక పూజలుచేసి, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు రామగుండం పోలీస్‌ కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి. పుష్కర ఘాట్ల దగ్గర పటిష్ట భద్రతా బందోబస్తు ఏర్పాట్లు చేశామని చెప్పారు. అర్జున గుట్ట దగ్గర భద్రతా ఏర్పాట్లతో పాటు, పుష్కర ఘాట్లు, పార్కింగ్ స్థలాలు, చెక్ పోస్టులను ఆయన తనిఖీ చేశారు. ప్రాణహిత పుష్కరాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 300 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు పోలీసుల సూచనలు తప్పక పాటించాలని, నది స్నానం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించారు. పుష్కరాల సమయంలో భక్తులతో పోలీసు అధికారులు,సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని, క్రమశిక్షణ ఓపికతో ప్రవర్తించి, పోలీసు శాఖ ప్రతిష్ట పెంచాలని ఆయన పోలీసు సిబ్బందికి సూచించారు.

Also read:

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హెచ్‌బీఏ పై వడ్డీని భారీగా తగ్గించిన సర్కార్..

Viral Video: ఒరే బుడ్డొడా ఏంట్రా ఇదీ.. ఒక్క దెబ్బతో చదువంతా బుర్రకెక్కాలట.. వీడియో చూస్తే పడి పడి నవ్వుతారు..!

History Creator: ఒకే ఓవర్లో 6 వికెట్లు.. సరికొత్త చరిత్ర సృష్టించిన బౌలర్.. ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించాడు..

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!