Ratan Tata: ఆర్ఎస్ఎస్ ఆస్పత్రి హిందువులకేనా.. కేంద్ర మంత్రిని ప్రశ్నించిన పారిశ్రామికవేత్త

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్‌ఎస్‌ఎస్(RSS) ఆసుపత్రి హిందువులకు మాత్రమేనా?' అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని(Nitin Gadkari) ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా(Ratan Tata) ప్రశ్నించారు. పుణెలోని సిన్హాగఢ్ ప్రాంతంలో ఛారిటబుల్ ఆస్పత్రిని...

Ratan Tata: ఆర్ఎస్ఎస్ ఆస్పత్రి హిందువులకేనా.. కేంద్ర మంత్రిని ప్రశ్నించిన పారిశ్రామికవేత్త
Nitin Gadkari
Follow us

|

Updated on: Apr 15, 2022 | 8:26 AM

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ – ఆర్‌ఎస్‌ఎస్(RSS) ఆసుపత్రి హిందువులకు మాత్రమేనా?’ అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని(Nitin Gadkari) ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా(Ratan Tata) ప్రశ్నించారు. పుణెలోని సిన్హాగఢ్ ప్రాంతంలో ఛారిటబుల్ ఆస్పత్రిని కేంద్ర మంత్రి ప్రారంభించారు. అయితే మతం ఆధారంగా ఆర్‌ఎస్‌ఎస్‌ వివక్ష చూపదని తనతో రతన్ టాటా ఓసారి అన్నారని తెలిపారు. గతంలో ఆయనకు, రతన్ టాటాకు మధ్య జరిగిన ఒక సంభాషణను గుర్తు చేశారు. శివసేన- బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు.. ఔరంగాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ దివంగత కేబీ హెడ్గేవార్ ఆసుపత్రిని రతన్‌ టాటాతో కలిసి ప్రారంభించానన్నారు. ఈ సందర్భంలో తనను రతన్ టాటా “ఈ ఆసుపత్రి హిందూవుల కోస‌మేనా?” అని అడిగినట్లు చెప్పారు. ఇందుకు సమాధానంగా.. మీరు ఎందుకు అలా అనుకున్నారని తాను ప్రశ్నించానని తెలిపారు. రతన్ టాటా వెంటనే ‘ఇది ఆర్‌ఎస్‌ఎస్‌కి చెందింది కావడంతో తనకు ఆ సందేహం కలిగిందని” చెప్పారన్నారు.

అయితే ఆసుపత్రి అన్ని వర్గాలకు చెందిందని, ఆర్‌ఎస్‌ఎస్‌లో మతం ఆధారంగా వివక్ష జరగదని అన్నారు. దీని గురించి మరింతగా వివరించడంతో రతన్‌ టాటా చాలా సంతోషించారని నితిన్‌ గడ్కరీ గుర్తు చేసుకున్నారు. గురువారం పుణేలో అప్లాఘర్‌ సేవా సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆస్పత్రి ప్రారంభ కార్యక్రమంలో కేంద్రమంత్రి గడ్కరీ ఈ ఘటనను గుర్తు చేసుకున్నారు. అలాగే దేశం ఆదివాసీల దీనస్థితిపై సంఘీభావం వ్యక్తం చేశారు.

Also Read

Elon Musk: ట్విట్టర్‌ కంపెనీ కొనుగోలుకు ఎలాన్ మస్క్ ప్రతిపాదన.. 41.39 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడి..