Bullet Trains: భారత్‌లో కూతపెట్టనున్న బుల్లెట్ ట్రైన్.. అధికారుల నుంచి కీలక అప్‌డేట్..!
Bullet Trains: గంట వ్యవధిలో 350 కిలోమీటర్ల వేగంతో గమ్యాన్ని చేరే బుల్లెట్ ట్రైన్స్ భారత్‌లో కూత పెట్టనున్నాయి. తాజాగా తొలి దశ ట్రయల్స్‌పై అధికారులు..
Bullet Trains: గంట వ్యవధిలో 350 కిలోమీటర్ల వేగంతో గమ్యాన్ని చేరే బుల్లెట్ ట్రైన్స్ భారత్‌లో కూత పెట్టనున్నాయి. తాజాగా తొలి దశ ట్రయల్స్‌పై అధికారులు ఓ ప్రకటన చేశారు. భారత ప్రజలు బుల్లెట్ ట్రైన్స్ (Bullet Trains) కోసం అంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సుదూర ప్రాంతాలకు రైల్లో ప్రయాణాలు చేయాలంటే ఒక్కోసారి రోజుల సమయం పడుతోంది. అయితే బుల్లెట్ ట్రైన్స్‌తో ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. కేవలం గంట వ్యవధిలోనే 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది రైలు. దీంతో బుల్లెట్ ట్రైన్స్ ఎప్పుడు మనదేశంలో అడుగుపెడతాయా ? అని ఎదురుచూస్తున్నారు ప్రయాణికులు. వీరి ఎదురుచూపులకు చెక్ పెడుతూ ఓ అప్‌డేట్ ప్రకటించారు అధికారులు.
అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌కు సంబంధించి 2026లో తొలిదశ ట్రయల్స్‌ను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 2027లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ (NHSRCL) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ అగ్ని హూత్రి తెలిపారు. మొదట గుజరాత్‌లోని బిలిమొర నుంచి సూరత్ మధ్య ఈ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇతర సెక్షన్లలో నిర్వహిస్తారు. ట్రయల్ రన్‌లో భాగంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్ పరుగులు పెడుతుందని, ఇది విమానం టేకాఫ్ అయ్యే వేగంతో సమానమని అధికారులు తెలిపారు. అయితే, ప్రజలకు అందుబాటులోకి వచ్చాక గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్స్ రన్ అవుతాయన్నారు అధికారులు.
విమాన ప్రయాణంలో పోటీ పడనున్న బుల్లెట్ ట్రైన్:
బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే రవాణా వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. విమాన ప్రయాణంతో బుల్లెట్ ట్రైన్ పోటీ పడనుంది. విమాన ప్రయాణంతో పోల్చినప్పుడు చెక్-ఇన్ టైమ్ తక్కువగా ఉంటుంది. అంతేకాదు కూర్చునేందుకు కూడా సౌకర్యంగా ఉంటుంది. విమానాల్లో అందుబాటులో లేని కనెక్టివిటీ సదుపాయం బుల్లెట్ ట్రైన్‌లో లభిస్తుంది. ప్రత్యేకంగా రూపొందించిన స్లాబ్ ట్రాక్ సిస్టమ్‌గా పిలిచే ప్రత్యేక ట్రాక్‌పై ఈ రైళ్లు రన్ అవుతాయి. అయితే, ఈ రైలు టికెట్ ధర దాదాపు ఎకానమీ విమాన టికెట్ ధరకు సమానంగా ఉండే అవకాశం ఉంది.
భారత్‌లో ఇప్పడు బుల్లెట్ రైలు కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. ఈ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాక అహ్మదాబాద్ నుంచి ముంబైకి కేవలం 2 గంటల 58 నిమిషాల్లో చేరుకోవచ్చు.
ఇవి కూడా చదవండి: